ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలకు బాబు షూరిటీలకు ..గ్యారెంటీ ఏది చంద్రబాబు..
1 min readకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీల మోత.
సూపర్ సిక్స్ హామీలకు తూట్లు పొడిచి.. కరెంట్ చార్జీల మోత మోగించిన కూటమి సర్కార్.
విద్యుత్ శాఖ సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే.
మి విజన్ ఎటుపోయింది చంద్రబాబు.
ప్రజలను మోసం చెయ్యడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : పట్టణంలో వైయస్ఆర్ సిపి కేంద్ర పార్టి కార్యాలయం పిలుపు మేరకు, వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి బుట్టా రేణుక గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ సిపి నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి విద్యుత్ శాఖా ఎడి కి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైయస్ఆర్ సిపి వీరశైవ లింగాయాత్ విభాగ రాష్ట్ర అధ్యక్షులు వై రుద్ర గౌడ్,వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్,పట్టణ అధికార ప్రతినిధి సునీల్,కౌన్సిలర్ నాగేశప్పా,నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు విరూపక్షి రెడ్డి,మాజీ ఎల్ ఎల్ సి డైరెక్టర్ గడ్డం నారయణ రెడ్డి గార్లు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ.. భవిష్యతు గ్యారంటీ అని టీడీపీ నేతలు ప్రచారం చేయగా.. వాస్తవ పరిస్థితి చూస్తే బాబు ష్యూరి టీ.. బాదుడు గ్యారంటీ అనేది స్పష్టంగా తెలుస్తోందని ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు వాతలు పెట్టిన చంద్ర బాబు విద్యుత్ చార్జీలు పెంచి, తమపై నిందలు మోపడం దారుణమన్నారు. ఈ ఐదు నెలల్లోనే ప్రజలపై రూ.15,486 కోట్ల అదనపు భారం మోపితే.. చంద్రబాబు హయాంలో ఇప్పటి వరకు రూ.90 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో కరెంట్ చార్జీలు పెంచనని చెప్పి ఇష్టారీతిన పెంచుతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ రంగం పెనుసంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని ఇప్పటికే దారుణంగా మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పప్పు, ఉప్పు మొదలుకుని వంటనూనె వరకు ధరలు, స్కూల్ ఫీజుల మోతకు తోడు విద్యుత్ చార్జీల భారంతో సామాన్యుల నడ్డి విరుగుతోందన్నారు._ 2,400 మెగావాట్లు అంటే 4,200 మిలియన్ యూనిట్లపై ఏటా రూ.1,500 కోట్లు, 25 ఏళ్లకు రూ.37,500 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. తమ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.1.10 లక్షల కోట్లు ఆదాయం వస్తే చంద్ర బాబు చేసుకున్న ఒప్పందాల వల్ల రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతోందన్నారు.2014-19 మధ్య పాలించిన చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లు అప్పుల ఊబిలోకి డిస్కమ్లు వెళ్లిపోయాయని వివరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు,ఎమ్మిగనూరు/గోనెగండ్ల/నందవరం మండలాల ఎంపీపీలు,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,సర్పంచులు, మండల/మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్లు,వార్డు ఇన్చార్జిలు,సచివాలయం కన్వీనర్లు,గృహ సారథులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.