PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల్లో  ప్రజలకు ఇచ్చినా  హామీలకు బాబు షూరిటీలకు గ్యారెంటీ ఏది ..ఎమ్మెల్యే

1 min read

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీల మోత.

సూపర్ సిక్స్ హామీలకు తూట్లు పొడిచి.. కరెంట్ చార్జీల మోత మోగించిన కూటమి సర్కార్.

 విద్యుత్ శాఖ సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబే. MLA విరుపాక్షి

 నిత్యా వసర వస్తువుల నుంచి మద్యం వరకు అన్ని రేట్లు పెరిగాయి.

 ఎన్నికల్లో సంపదను సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజల సంపదను ఆవిరి చేస్తున్నారని.

సంక్షేమ పథకాలు రాక పోవడంతో కుటుంబ ఆదాయం పడిపోయిందని,అప్పులు పెరగడంతో కాల్మనీ గ్యాంగ్లు హల్చల్

విద్యుత్ చార్జీలు పెంచడమేనా ని సంపద సృష్టి  చంద్రబాబు. సంపద సృష్టి అంటే ప్రజలకు భారం మోపడమేనా చంద్రబాబు.

పల్లెవెలుగు వెబ్ ఆలూరు :బాబు ష్యూరిటీ.. భవిష్యతు గ్యారంటీ అని టీడీపీ నేతలు ప్రచారం చేయగా.. వాస్తవ పరిస్థితి చూస్తే బాబు ష్యూరి టీ.. బాదుడు గ్యారంటీ అనేది స్పష్టంగా తెలుస్తోందని ఆరు నెలల్లో రెండుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు వాతలు పెట్టిన చంద్ర బాబు విద్యుత్ చార్జీలు పెంచి, తమపై నిందలు మోపడం దారుణమన్నారు. ఈ ఐదు నెలల్లోనే ప్రజలపై రూ.15,486 కోట్ల అదనపు భారం మోపితే.. చంద్రబాబు హయాంలో ఇప్పటి వరకు రూ.90 వేల కోట్ల భారం వేశారని MLA విరుపాక్షి గారు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో కరెంట్ చార్జీలు పెంచనని చెప్పి ఇష్టారీతిన పెంచుతున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ రంగం పెనుసంక్షోభంలో కూరుకుపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని ఇప్పటికే దారుణంగా మండుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పప్పు, ఉప్పు మొదలుకుని వంటనూనె వరకు ధరలు, స్కూల్ ఫీజుల మోతకు తోడు విద్యుత్ చార్జీల భారంతో సామాన్యుల నడ్డి విరుగుతోందన్నారు.పీపీఏలతో రూ.87,500 కోట్లు ఆవిరి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వైయస్ఆర్ సిపి ప్రభుత్వం, కేంద్ర ప్రభు త్వానికి చెందిన సెకీతో ఇంటర్ స్టేట్ ట్రాన్స్మి షన్ ఛార్జీ (ఐఎస్ఈసీ)తో కలిపి యూనిట్ విద్యుత్ రూ.2.49కే సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుందన్నారు. అంత తక్కువ ధరకే సౌర విద్యుత్ అందుబాటులోకి రావడం వల్ల ప్రభు త్వానికి ఏటా రూ.4,400 కోట్లు ఆదా అవుతుందని,ఈ విధంగా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేస్తే సంపద సృష్టించినట్టే కదా అని చెప్పారు. అదే చంద్రబాబు ప్రభుత్వం 2014-19 మధ్య విండ్ పవర్కు సంబంధించి 3,494 మెగావాట్లకు 133 ఒప్పందాలు చేసుకోగా.. గరిష్టంగా రూ.4.48కు అవగాహన కుదిరిందన్నారు.సోలార్ పవర్కు సంబంధించి 2,500 మెగావాట్లకు రూ.6.80 లెక్కన ఒప్పం దాలు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు ఒప్పందాల మేరకు సగటు రేటు రూ.5.10 అని MLA విరుపాక్షి   తెలిపారు .3,494 మెగావాట్ల విండ్ పీపీఏలకు సంబంధించి చంద్రబాబు చేసుకున్న ఒప్పందం రూ.4.84 కంటే మా ప్రభుత్వం చేసుకున్న రేటు రూ.2.49తో బేరీజు వేస్తే రూ.2.35 తక్కువ అన్నారు. 3,500 మెగావాట్లు అంటే 9 వేల మిలియను యూనిట్లకు రూ.2.35 చొప్పున లెక్కిస్తే ఏటా రూ.2 వేల కోట్లు ఇలా 25 ఏళ్లల్లో రూ.50 వేల కోట్లు కేవలం చంద్రబాబు చేసుకున్న విండ్ యూనిట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. ఇక సోలార్ ఎనర్జీ ఒప్పందాలు చూస్తే చంద్రబాబు 2,400 మెగావాట్లకు చేసుకున్న ఒప్పందం యావరేజ్ ప్రైజ్ రూ.5.90.అదే మా ప్రభుత్వం రూ.2.49కే ఒప్పందం చేసుకుంది.అంటే బాబు హయాంలో కన్నా మా హయాంలోనే రూ.3.41 తక్కువని తెలిపారు.2,400 మెగావాట్లు అంటే 4,200 మిలియన్ యూనిట్లపై ఏటా రూ.1,500 కోట్లు, 25 ఏళ్లకు రూ.37,500 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. తమ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.1.10 లక్షల కోట్లు ఆదాయం వస్తే చంద్ర బాబు చేసుకున్న ఒప్పందాల వల్ల రూ.87,500 కోట్ల సంపద ఆవిరవుతోందన్నారు.2014-19 మధ్య పాలించిన చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.86,215 కోట్లు అప్పుల ఊబిలోకి డిస్కమ్లు వెళ్లిపోయాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు BVR అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *