ఏమిటి ఈ దుస్థితి?
1 min readవిద్యుత్ చార్జీలు పెంచడం మీరే తగ్గించాలని ధర్నా చేయడం మీరేనా
టిడిపి ప్రభుత్వంలో అబద్ధపు హామీలు ఉండవ్ జగన్మోహన్ రెడ్డి
మీ జమానా లో చేసిన అనాలోచిత విద్యుత్ ఒప్పందాలు పిపిఎ రద్దు నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజల నెత్తిన పడిన సర్దు బాటు చార్జీల భారం రూ 15,485 కోట్ల పాపానికి బాద్యులు ఎవరు
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : ప్రజల పై కరెంటు చార్జీలు పెంచడం మీరే తగ్గించాలని ధర్నా లు మీరేనా మన రాష్ట్రంలో ఏం దుస్థితి ఏర్పడిందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి విమర్శించారు. శనివారం మాధవరం గ్రామంలో తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి కరెంట్ చార్జీలు ఎందుకు పెంచారు అని మా ప్రభుత్వాన్ని అడగాలి కాని అది మానేసి రోడ్ల మీద ముద్దులు,యాత్రలు, దండాలు ధర్నాలు చేయకూడదని సూచించారు . మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్లి అడగండి మిగులు విద్యుత్ పాలన ప్రారంభించే ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వనురులు ఉన్న రాష్ట్రంలో నేడు ప్రధాన కారణం ముమ్మాటికి జగన్ రెడ్డి అవినీతి కక్ష సాధింపు రాజకీయాలే కారణం అని అన్నారు. పోలవరం జల విద్యుత్ కేంద్రం 2021కే పూర్తి చేయలేకపోవడం వల్ల రూ 4,737 కోట్లు రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. వైసీపీ హయంలో మీరు మైలవరం సోలార్ ప్లాంట్ పై దాడి చేసి ధ్వంసం చేశారని దానివల్ల 7 వేల మెగావాట్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్ ఉత్పత్తి కోల్పోయాడమే కాకుండా మా రాయలసీమ, ప్రకాశం జిల్లాలో యువకులకు ఉద్యోగాలు రావడమే కాకా రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండేదని తెలిపారు. విద్యుత్ సంస్థల పైన రూ 49 వేల కోట్లు పైగా అప్పు చేసిన ఒక్కటంటే ఒక్క విద్యుత్ ప్లాంట్ కూడా నిర్మించలేదని ప్రశ్నించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు లాంటి విద్యుత్ పరికరాలు కమిషన్ల కోసం ఎక్కువ రేటుకు కొన్నందుకు వేలకోట్ల నష్టం వచ్చిందని అది ఎవరి వలన జగన్ రెడ్డిని ప్రశ్నించారు. జగన్ అవినీతి వల్లే విద్యుత్ బారాలు రూ 1,29 వేల కోట్ల విద్యుత్ చార్జీల పెంపు పాపం గత వైసిపి ప్రభుత్వానిదే అన్నారు. జగన్ అవినీతి అసమర్థతో రాష్ట్రానికి జరిగిన నష్టం 2019- 24లో వి టిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు లో జాప్యంతో నష్టం రూ 12818 కోట్లు, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు చెప్పెంతో నష్టం రూ 4737 కోట్లు, స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం రూ 2691 కోట్లు, ఏడాదికి 7 మెగావాట్ల సోలార్ పవర్ కి నష్టం రూ 3,85 కోట్లు, అప్పుల పై వడ్డీ భారం రూ 10,892 కోట్లు, ఏపీ డిస్కమ్ లు ఏపీపీడీసీఎల్ నిర్వహణ వైఫల్యాలతో వచ్చిన నష్టం రూ 9618 కోట్లు 7) జెన్ కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వల్ల వచ్చిన నష్టం రూ3,135 కోట్లుజగన్ రెడ్డి నువు మీ వైసీపీ ప్రభుత్వంలో చేసిన విద్యుత్ అవినీతి చిట్టాలు మొత్తం కలిపితే 1,29, 503 కోట్లు అన్నారు. ఇలా ముమ్మాటికి జగన్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచి ఇప్పుడు ధర్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇలా చేయడం మీకు సిగ్గు చేటు అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి కి సహకరించాలని సూచించారు.