ఏం జరుగుతోంది..నేను చెప్పినా పలకరా..
1 min readభూ సమస్యలను పరిష్కరించరు
ఎవరి దగ్గర లోపం..?
ట్యాంకులను ఎంతమంది శుభ్రం చేస్తున్నారు
రెవెన్యూ అధికారులపై భగ్గుమన్న ఎమ్మెల్యే జయసూర్య..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతోంది..తహసిల్దార్ ఉంటేనే వీఆర్వోలు పలుకుతారు లేకపోతే పలుకరు అధికంగా వీఆర్వోలపైనే సమస్యలు వస్తున్నాయని విఆర్ఓ లపై నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు తహసిల్దార్ కార్యాలయం దగ్గర ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతులను ప్రజల నుండి ఆయన స్వీకరించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ కొణిదెలలో ఇంటి పట్టాలపై మహిళలు నా దగ్గరికి వచ్చారు.అక్కడ వీఆర్వో ఏం చేస్తున్నారు.మల్యాల రైతు నా దగ్గరికి వస్తే 3 సార్లు వీఆర్వో దగ్గరికి పంపించినా వీఆర్వో స్పందించడు.ముఖ్యమంత్రి ప్రజల వినతులను తీసుకుంటూ పరిష్కరిస్తూ ఉంటే ఇక్కడ ఏమో మీరు సమస్యలపై స్పందించడం లేదు.తూతూ మంత్రంగా వచ్చి వెళ్తున్నారు.మేమంతా మంచిగా పని చేస్తూ ఉంటే కింది స్థాయి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వస్తున్నారని విఆర్ఓ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల దగ్గరనా..అధికారుల దగ్గరనా ప్రజల దగ్గర లోపం ఉందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వీఆర్వోలు పంచాయతీ కార్యదర్శులు ప్రతిరోజూ గ్రామాలకు వెళ్లాల్సిందే మీరు తప్పించుకోవాలని చూస్తే తప్పించుకోలేరు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఎంతమంది ట్యాంకులను శుభ్రం చేస్తూ ఉన్నారని పంచాయతీ కార్యదర్శులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. గ్రామాల్లో మీకు సమస్యలు వస్తూ ఉంటే మండల అధికారుల దృష్టికి ఎందుకు తీసుకు రావడం లేదన్నారు.ప్రజలకు మీరందరూ జవాబు దారీ తనంగా పనిచేయాలని సమస్యలను పట్టించుకోవాలనుకున్నారా లేక గాలికి వదిలేయాలని అనుకున్నారా అంటూ అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తర్వాత ప్రజల నుండి ఎమ్మెల్యే వినతులను స్వీకరించారు.బిజినవేముల గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సర్పంచ్ రవి యాదవ్ ఎమ్మెల్యేకు విన్నవించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ,తహసిల్దార్ బి శ్రీనివాసులు,డిఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు.