PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంచి చేసిన వారెవరు? ముంచేసిన వారెవరు? : ఆర్థిక శాఖ మంత్రి

1 min read

డోన్ లో మొత్తం 195 అభివృద్ధి పనుల్లో..35 భారీ ప్రాజెక్టులు

‘కోట్ల’కు డోన్ అభివృద్ధి పుస్తకం పంపుతా..వస్తే నేరుగా కారులో తిప్పి చూపుతా..

రాష్ట్ర విభజన సమయంలో చీకటి ఒప్పందం వల్లే’కోట్ల’కు పదవి

రూ.18 కోట్లతో ప్యాపిలి పట్టణంలో నిర్మించిన రోడ్డు అభివృద్ధి కాదా?

ప్యాపిలి ప్రజల ఇష్టదైవం కంబగిరిని ఎందుకు అభివృద్ధి చేయలేదు?

ప్యాపిలిలో చెరువులు నింపాలని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?

తాగునీటి కొరత తీర్చడానికి కనీసం ఏనాడైనా ఆలోచన చేశారా?

దేశంలోనే ఏడో భారీ టెర్మినల్ మార్కెట్ ప్యాపిలిలో నిర్మిస్తోంది నిజం కాదా?

‘కోట్ల’ కుటుంబం సొంత ఊరికి ఇంత వరకూ రోడ్డెందుకు వేయలేదు?

రేకుల షెడ్డుకు..పఫ్ షీట్ లకు తేడా తెలియని మీరా అభివృద్ధిపై మాట్లాడేది?

డోన్ ను నంద్యాలలో కలిపిన మీరే  కర్నూలులో కలుపుతామంటూ హామీనా?

15 ఏళ్లు ఎవరికీ అందుబాటులో లేని మీరా నన్ను అందుబాటులేరనేది?

అభివృద్ధి చేయడం అంటే ‘పేకాట’తో కాలక్షేపం చేయడం కాదు

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి:  డోన్ లో 195 అభివృద్ధి పనులు పూర్తి చేశామని..అందులో భారీ ప్రాజెక్టులే 35 ఉన్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ‘కోట్ల’కు తాను చేపట్టిన అభివృద్ధికి సంబంధించిన పుస్తకం పంపుతానన్నారు. పోలింగ్ తర్వాతైనా వస్తే వారం రోజులపాటు తన కారులో తానే డ్రైవింగ్ చేసి చూపిస్తానని మంత్రి స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్యాపిలి పట్టణంలో శుక్రవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భారీ ర్యాలీ నిర్వహించారు. పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో మంత్రికి స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు, యువత  పెద్దఎత్తున హాజరై మంత్రి ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పట్టణం నడిబొడ్డున ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బుగ్గన ప్రసంగించారు. దేశంలోనే ఏడో భారీ టెర్మినల్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ లో రూ.50 కోట్లతో మొట్టమొదటి మార్కెట్ గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో రహదారి ఏర్పాటుకే రూ.18 కోట్లు ఖర్చుపెట్టామన్నారు. మురుగుకాలువలు, షటిల్ కోర్టు, ఆర్ అండ్ బీ అతిథి గృహం, పార్కులు అభివృద్ధి చేశామన్నారు. ప్యాపిలి మండలంలో తాగునీటి సమస్య నెరవేర్చడం కోసం రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులలో ఒకటైన వాటర్ గ్రిడ్ ద్వారా గోరుకల్లు నుంచి డోన్ లోని ఇంటింటికి త్వరలోనే తాగునీరందించనున్నామన్నారు. రూ.3వేల కోట్లతో ఇన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టినా డోన్ కూటమి అభ్యర్థి అభివృద్ధి లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్యాపిలి ప్రజల ఇష్ట దైవం కంబగిరి క్షేత్రం అభివృద్ధి చేయాలని కూడా ఏనాడూ అనిపించలేదా అని నిలదీశారు. కనీసం కోట్లవారి సొంత గ్రామానికి ఇంతవరకూ రోడ్డెందుకు వేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. విద్యాలయాలు, హాస్పిటల్ కట్టడాలను చూసి రేకుల షెడ్డు అని మాట్లాడడం ‘కోట్ల’కు పఫ్ షీట్ మీద అవగాహన లేకపోవడమేనన్నారు. 15 ఏళ్లు ఎక్కడున్నారో, ఎవరికి అందుబాటులో ఉన్నారో తెలియని ‘కోట్ల’ నెల క్రితం వచ్చి మంత్రి అందుబాటులో ఉండరని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. డోన్ లో కట్టిన గుడి, బడి, రోడ్డు సహా ప్రతి పనిలో మంత్రి బుగ్గన ఉన్నట్లేనన్నారు. ఏం చేస్తారో చెప్పకుండా డోన్ ను అభివృద్ధి చేస్తామని విపక్షాలు మాట్లాడడం..పేకాట ఆడి కాలక్షేపం చేయడమంత సులభం కాదన్నారు. తాగునీటి కొరత తీర్చాలన్న కనీస ఆలోచన నాడు కేంద్ర మంత్రి పదవులు అనుభవించినపుడు  తెలియలేదా అని ప్రశ్నించారు. అసలు కోట్లకు కేంద్ర మంత్రి పదవి వచ్చిందే చీకటి ఒప్పందం వల్ల అని విమర్శించారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు..రాష్ట్ర ప్రజలంతా విభజన వద్దని రోడ్ల మీదకు వచ్చినప్పుడు..అల్లర్లు కాకుండా చూస్తామని సంతకం పెట్టినందుకే సోనియాగాంధీ పదవి ఇచ్చిందన్నారు. అన్నీ అయిపోయాక ఉత్తుత్తి హామీలతో చంద్రబాబులాగే మభ్యపెట్టే హామీలిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల ఎంపీగా ఉన్న నాడే డోన్ ను నంద్యాల జిల్లాలో కలిపారన్నారు. కానీ, నేడు ఏ ఉద్దేశంతో మళ్లీ డోన్ ను కర్నూలులో కలుపుతామంటున్నారని ప్రశ్నించారు. ప్యాపిలి ప్రజలు మంచి చేసేదెవరు? ముంచేసేదెవరు? తేల్చుకుని సరైన మనిషికి ఓటెయ్యాలన్నారు. అంతకుముందు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీగా మంత్రి బుగ్గన ముందుకు సాగారు. యువత బైక్ ర్యాలీ చేస్తూ మంత్రి బుగ్గనకు ఘన స్వాగతం పలికారు. మంత్రి బుగ్గన ర్యాలీకి ప్యాపిలి పట్టణంలో అపూర్వ స్పందన లభించింది.ఈకార్యక్రమంలో సర్పంచ్ సి.లక్షిదేవి, జెడ్పీటీసీ బో రెడ్డి శ్రీరామి రెడ్డి,బో రెడ్డి పుల్లారెడ్డి ,ఉప సర్పంచ్ గడ్డం భువనేశ్వర్ రెడ్డి, వ్యవసాయ సలహా చైర్మన్ మొట్టను వెంకటేశ్వర రెడ్డి, గజేంద్ర రెడ్డి, కమతం భాస్కర్ రెడ్డి,బషిర్, మస్తాన్, చిన్న సుంకయ్య,రాజా మురళి కృష్ణ,బోర్ర మల్లికార్జున రెడ్డి,కొండయ్య,తుట్టు, సింగిల్ విండో అధ్యక్షుడు బోరెడ్డి రామచంద్రుడు, వెంకటేశ్వర రెడ్డి, రజిని రెడ్డి,బో రెడ్డి రఘునాథ్ రెడ్డి, బో రెడ్డి క్రిష్ణ రెడ్డి, పర్వతం వాసు రెడ్డి, అంజి, పెద్ద రాజు,

About Author