PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిగ్గు ఎగ్గులేని జగన్ రెడ్డి పరామర్శ ఎవరికి కావాలి

1 min read

ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు

పల్లెవెలుగు వెబ్  నంద్యాల:    పబ్లిసిటీ పిచ్చితో  రాష్ట్రాన్ని దివాలా తీసే స్థితిని తీసుకొని వచ్చి ఈరోజు అధికారం లేకపోయేసరికి పరామర్శ పేరుతో పబ్లిసిటీ కోసం తహతలాడుతున్నజగన్  రెడ్డి?== గో బ్యాక్== నీవు అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది బీసీలను అవమానాలకు గురి  చేసి హత్యలకు గురి చేస్తే కనీసం స్పందించలేదు. అదే కాక తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా   బాధితులకు సపోర్ట్  చేసిన వాళ్లను ఆర్థికంగా రాజకీయంగా దెబ్బతీసి  అణగదొక్కిన నీవు పరామర్శ పేరుతో ప్రగల్బాలు పలుకుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి నీకు గుర్తుందా తెనాలిలో అమర్నాథ్  గౌడును కాళ్లు చేతులు  కట్టేసి నోట్లో బట్టలు కుక్కి  పెట్రోల్ పోసి తగలబెట్టారు గుర్తుందా స్పందించావా ఇదే నంద్యాలలో సలాం కుటుంబం నలుగురు మీ గవర్నమెంట్  టార్చర్ తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే కనీసం స్పందించలేదు  నడిరోడ్డులో కానిస్టేబుల్ సురేంద్రాను పరిగెత్తించి హత్య చేస్తే ఆ కుటుంబానికి ఎలాంటి పరామర్శ లేదు నీ ప్రభుత్వంలో మాస్కులు అడిగిన పాపానికి  దళిత డాక్టర్ను పిచ్చోడు ముద్ర వేసి హత్య చేసిన వ్యవస్థ నీది డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేస్తే డోర్ డెలివరీ చేసిన వ్యక్తులు పక్కన పెట్టుకొని నవ్వుకున్నది నువ్వు ఎంతోమంది బీసీల ఆస్తులను నీ  అనుచరులను బందు గణాలను అడ్డుపెట్టి వేల ఎకరాలను దోచుకున్న సందర్భంలో అడ్డు వచ్చిన బీసీల తలలు   తెంచి బీసీలను పాతాళానికి తొక్కింది నీవు కాదా ఇన్ని పాపాలు చేసినందుకే  నువ్వు నేర్పించిన  బటన్ నొక్కుడుతో బ్యాలెట్ బటన్ నొక్కి ప్రతిపక్ష హోదా లేకుండా పులివెందులకే పరిమితం చేశారు.

About Author