PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కల్లుబావి గ్రామ అభివృద్దికి కృషి చేస్తా :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎల్లప్పుడూ మీ కష్ట,సుఖాల్లో తోడుంటానని ఆదివారం కల్లుబావిలో జానసేన నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి  అన్నారు. కల్లుబావి లో ఉన్న సమస్యలను గ్రామ పెద్దలు , జానసేన పార్టీ నాయకులు,BJP నాయకులు MLA దృష్టికి తీసుకోని వచ్చారు.స్పందించి మాట్లాడిన ఎమ్మెల్యే కల్లుబావిలో రోడ్లు గాని, డ్రైనేజీ  కాలువలు గాని, నీటి సమస్య తీర్చడం కానీ, పేకాట ఆడడం మానిపించడం కానీ వంటి సమస్యలనుండి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య తీర్చుకుంటూ ఐదేళ్లలో కల్లుబావిలో సమస్యలే లేవు అనే స్థాయికి తీసుకు వెళ్తానని , అత్యధిక మెజారిటీతో గెలిపించిన కల్లుబావిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని అన్నారు, ఇక కల్లుబావిని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని చెప్పారు. బుడగ జంగాల వారి కుల ధ్రువీకరణ పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని అన్నారు.   ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు మహేష్ యాదవ్ , బిజెపి నాయకులు వడ్డే శ్రీనివాసులు, ఉపేంద్ర కుమార్, అడ్వకేట్ లోకేష్ కుమార్, గోపాల్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

About Author