PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ అందరి ఆశీస్సులతో కూటమి అభ్యర్థులను గెలిపించండి

1 min read

ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ సహకారంతో మరింత అభివృద్ధి అందిస్తాం

సైకిల్ పై ఓటు వేసి గెలిపించండి,జీవితాంతం మీ పెద్ద కొడుకుగా పని చేస్తా

చింతన ప్రభాకర్ కొవ్వలి గ్రామంలో విస్తృత ప్రచారం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు మండలం దోసపాడు కొవ్వలి గ్రామాల్లో సోమవారం ఉదయం జరిగిన చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచార కార్యక్రమం దెందులూరు మజాకా అన్న విధంగా పులాభిషేకలతో, మంగళ హారతులతో దిగ్విజయంగా జరిగింది. వైసిపి పాలనకు ముగింపు దగ్గర పడటంతో దెందులూరు గ్రామాల్లో వెల్లువెత్తుతున్న సంబరాలు శిఖరాగ్రస్థాయిలో  ఉత్సాహంగా చిందులు వేస్తున్న గ్రామస్థులు గెలుపు దిశగా పరుగులు పెడుతున్నారు. చింతమనేని కి ఘన స్వాగతం పలుకుతూ భారీగా తరలి వచ్చిన గ్రామస్థులు ఉప్పొంగిన ప్రజాభిమానం చూసి ఆశ్చర్య పోయిన చింతమనేని ప్రభాకర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతమంది ప్రజలు తనను అభిమానిస్తుంటే ఆనందంతో తబ్బి బయ్యారు.వీధి వీధిలో వాడవాడలా చింతమనేని కి గ్రామస్థుల ఘన స్వాగతంతో కుటమి అభ్యర్థులు ప్రచారంలో ఆయనను అనుసరించారు.వైసిపి నీ వీడి టిడిపిలో చేరిన పలువురు నాయకులు  ఏలూరు ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ తో కలిసి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన చింతమనేని ప్రభాకర్ ఓటమికి ఓటేసి గెలిపించాలన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తాం అని భరోసా చింతమనేని కల్పించారు. కార్యక్రమంలో భారీగా పాల్గొన్న టిడిపి, జనసేన, బిజేపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఇంటి స్థలం కోసం ప్రశ్నిస్తే దెందులూరులో మహిళలపై దాడులు చేస్తున్నారు ఈ వైసిపి నాయకులు. ఇక ఈ అరాచక పాలనకు ముగింపు వచ్చేసిందన్నరు.గోదావరి నుంచి పైప్లైన్ వేసి, టాంక్ నిర్మిస్తాం, వూరంతా కొత్త పైప్ లైన్ వేసి, ప్రతీ ఇంటికి త్రాగునీరు పైపు అందిస్తాంమని నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లనుకు హామీ ఇచ్చారు.ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని మీ గ్రామానికి అవసరం అయిన ప్రతీ అభివృద్ధి పనిని పూర్తి చేస్తామన్నారు.బాబు షూరిటీ, సూపర్6 పథకాలు వివరించి అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుతోనే ఉందన్నారు.చంద్రన్న భీమా 10లక్షలు అమలు చేస్తామని, ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా ఉంటాను అన్నారు.ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ సహకారంతో మీకు అవసరం అయిన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇస్తున్న అన్నారు.నాకోసం ఇంతగా బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.జూన్4 తర్వాత మీ అందరి ఆశీస్సులతో నేను మీ ఎమ్మెల్యే గా కాబోతున్నాను.మే 13వరకు మీరందరూ కృషి చేయండి అక్కడి నుంచి 5ఏళ్ళ పాటు మీ కోసం ప్రతి క్షణం నేను కృషి చేస్తాను అన్నారు.

About Author