అంతర్జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో జయకేతనం
1 min readప్రతిభ కనబరచి, ట్రోఫిలు సాధించిన… రైమ్స్ అకాడమీ విద్యార్థులు.
విద్యార్ధులను అభినందించిన … కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంతర్జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో ప్రతిభ కనబరచిన రైమ్స్ అకాడమి విద్యార్దులను కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపియస్ కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో శుక్రవారం అభినందించారు. విద్యార్దులు కష్టపడి చదువుకొని, ఇంకా ఉన్నత శిఖరాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెల (డిసెంబర్) 14, 15 వ తేదీలలో న్యూఢిల్లీలోని డిల్లీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్రపంచస్థాయి అబాకస్ మెంటల్ అర్థమేటిక్ పోటీల్లో 30 పైగా దేశాల నుండి 6 వేల మంది పై గా విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు రైమ్స్ అకాడమీకి చెందిన 32 మంది విద్యార్దులు పాల్గొన్నారు.ఇందులో 32 మంది ప్రతిభ కనబరిచారు. 6 మంది చాంపియన్స్ , 8 మంది ఫస్ట్ రన్నరప్, 4 సెకండ్ రన్నరప్, 12 మంది థర్డ్ రన్నరప్, ఇద్దరు ఫోర్త్ రన్నరప్ గా నిలిచారు. ఢిల్లీ వేదికలో ఈ ట్రోఫిలను సాధించారని రైమ్స్ అకాడమి డైరెక్టర్స్ రూప తెలిపారు. ఈ కార్యక్రమంలో రైమ్స్ అకాడమి డైరెక్టర్ రూప, అధ్యాపకులు యమున, జయశ్రీ, భార్గవి, అర్షియ, మౌనిక ఉన్నారు. కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయం , కర్నూలు.