వెల్ బేబీ పోటీలో జైన్ అషరఫ్ గెలుపు
1 min readఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
హైదరాబాద్ :హైదరాబాద్ యశోధ హాస్పిటల్ మరియు 8వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ హైదరాబాద్ వారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోని గాంధీ సెంటెన్నరీ మెమోరియల్ హాల్ లో ఆదివారం రాత్రి సంయుక్తంగా నిర్వహించిన వెల్ బేబీ పోటీలో డా. సయ్యద్ జావిద్ అషరఫ్ , డా. సయ్యదా షహీరా దంపతుల కుమారుడు సయ్యద్ జైన్ అషరఫ్ గెలుపొందారు. బేబీ ఎత్తు, బరువు, పరిశుభ్రత, వస్ర్తాదరణ తదితర అంశాలపై నిర్వహించిన పోటీలో చాలా మంది పిల్లలు పాల్గొనగా… అందులో మూడు నెలల చిన్నారి జైన్ అషరఫ్ విజయం సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిన్నారి తాత , రిటైర్డు జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్ మాట్లాడుతూ ఈ విజయం కేవలం జైన్ ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క గుర్తింపు మాత్రమే కాదని, మేము అతనిపై చూపిన ప్రేమ మరియు సంరక్షణకు నిదర్శనమన్నారు. ఈవెంట్‌ని నిర్వహించినందుకు యశోద హాస్పిటల్స్‌కు మరియు జైన్‌ని నిస్పక్షపాతంగా విజేతగా ఎంపిక చేసినందుకు న్యాయనిర్ణేతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.