PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగ శక్తి తో మరణాలను గణనీయం గా తగించవచ్చు    

1 min read

డా.మాకాల సత్యనారాయణ

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవంలో బాగంగా  21 వ రోజు ఇబ్రహీంపట్నం  ఎ పి జెన్కో నందు యోగ ఉత్సవాలలో పాల్గొన్న యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డా. మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ అసహజ మరణాల తగింపుకు యోగ శక్తి చికిత్సనీ అన్ని ఆరోగ్య విభాగాలు ప్రోత్సహించాలిసిందిగా కోరారు. ప్రస్తుతం సంభవిస్తున్నటువంటి మరణాలలో ఎక్కువ శాతం సరైన ఆహారం తీసుకోకపోవడం లేదా వికటించడం మరియు సరైన వైద్యం అందకపోవడం లేదా వికటించడం వాటి వలన సంభవిస్తున్నాయని యోగ శక్తి చికిత్స ద్వారా ఈ మరణాలను గణనీయం గా తగించవచ్చునని తెలిపారు. ఈ యోగశక్తి చికిత్సను కొంతమందిపై డిమనెస్ట్రేషన్ చేసి చూపించారు. ప్లాంట్ చీఫ్ నాగరాజు  మాట్లాడుతూ యోగ అందరూ ప్రాక్టీస్ చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని కోరారు. యోగశక్తి సాధన సమితి వ్యవస్థాపకులు డా.మాకాలసత్యనారాయణ ని గనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ డెంట్ ఇంజినీర్ సురేష్ బాబు, డి ఎస్ శ్రీమతి సుశీల, ఎపిఎస్ఈ ఇంజినీర్స్ అసోసియేషన్ ట్రెజరర్ వెంకట రమణ , డిఈ సురేష్ , ఉద్యోగులు పాల్గొని  యోగ చేశారు.

About Author