PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

29వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణ

1 min read

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 23 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 37 సెట్ల నామినేషన్లు

స్క్రూటినీలో 15 మంది అభ్యర్థుల 26 సెట్ల నామినేషన్లకు ఆమోదం

9 మంది అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరణ

29వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణ

పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 23 మంది అభ్యర్థులు 37 సెట్ల నామినేషన్లు వేయడం జరిగిందని, అందులో 15 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 26 సెట్ల నామినేషన్లు ఆమోదించడంతో పాటు 8 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయని పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు.శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో పాణ్యం-138 నియోజకవర్గానికి సంబంధించి స్క్రూటినీ అనంతరం ఆమోదించిన, తిరస్కరించిన నామినేషన్ల వివరాలను పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాత్రికేయులకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 37 సెట్ల నామినేషన్లు 23 మంది అభ్యర్థులు దాఖలు చేయడం జరిగిందన్నారు. నామినేషన్ల స్క్రూటినీలో 37 నామినేషన్లలో 15 మంది అభ్యర్థుల 26 నామినేషన్లు ఆమోదించామని పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం స్క్రూటినీ చేసి సదరు నామినేషన్లను తిరస్కరించడం జరిగిందన్నారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఏప్రిల్ 29వ తేది మ.3గం.ల లోపు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 26వ తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అందుకు సంబంధించిన ఫేసిలిటేషన్ సెంటర్ ప్రభుత్వ బాలుర పాఠశాల, బి.క్యాంపులో ఏర్పాటు చేయడం జరుగుతుందని పాణ్యం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ వివరించారు.

పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్లు ఆమోదించిన అభ్యర్థుల వివరాలు

1) వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి

2) టిడిపి పార్టీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి

3) కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్

4) బిఎస్పీ పార్టీ అభ్యర్థి దాసరి రామ శేషయ్య

5) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) అభ్యర్థి బత్తుల చిన్నయ్య

6) జన సహాయ శక్తి అభ్యర్థి మల్లెపోగు జమన్న

7) సూపర్ రేంజర్స్ పార్టీ అభ్యర్థి బొగ్గుల మహేంద్ర బాబు

8) ఆంధ్రరాష్ట్ర ప్రజాసమితి కె.కృష్ణమాచారి

9) అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హరుణ్

10) జై భారత్ పార్టీ అభ్యర్థి రఘురామిరెడ్డి

11) నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలుగు భాస్కర్

12) ఇండియా ప్రజా బంధు పార్టీ అభ్యర్థి మల్లపు రాజు

నామినేషన్ ఆమోదించిన స్వతంత్ర అభ్యర్థుల వివరాలు

1) స్వతంత్ర అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి

2) స్వతంత్ర అభ్యర్థి జలదుర్గం సీతమ్మ

3) స్వతంత్ర అభ్యర్థి చిరంజీవి

నామినేషన్లు తిరస్కరించిన అభ్యర్థుల వివరాలు

1) కాటసాని శివనరసింహా రెడ్డి, వైఎస్సార్సీపీ

2) గౌరు వెంకటరెడ్డి, టిడిపి

3) జి.రామకృష్ణ, సిపిఎం

4) కె.చంద్రశేఖర్, నేషనల్ మహాసభ పార్టీ

5) అవుల చిన్న అయ్యన్న, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ

6) పెరుగు శివ కృష్ణ, సమాజ్‌వాది పార్టీ

7) మొలకల సూర్య ప్రదీప్, రాయలసీమ ప్రజాసమితి

8) షేక్ అబుబకర్ బాష్, జాతీయ జన సేన పార్టీ

9) బికె.నాగరాజు, స్వతంత్ర

About Author