పది నిమిషాల్లోనే..సర్వసభ్య సమావేశం..తూతూ మంత్రంగా..వచ్చామా వెళ్ళామా..
1 min read-ఎన్నికల కోడ్ ఉన్నందునే సమావేశాన్ని ముగించాం-ఈఓఆర్డి వివరణ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యల పైన వాడీ వేడిగా చర్చ జరిగేది.కానీ నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఈఓఆర్డి ఫక్రుద్దీన్ సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశం ప్రారంభించిన పది నిమిషాల్లోపే సర్వసభ్య సమావేశాన్ని తూతూ మంత్రంగా అధికారులు ముగించారు.11:15 నిమిషాల తర్వాత మండలంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కొందరు మండల పరిషత్ కార్యాలయానికి వస్తూ ఉన్నారు.అప్పటికే సమావేశం ముగియడంతో కొందరు ప్రజా ప్రతినిధులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మండల అధికారులు ఇంకా కొందరు సమావేశానికి గైర్హాజర్ అయ్యారు.రిజిస్టర్ లో సంతకాలు చేయ్యాలంట సంతకాలు చేసి వస్తామని స్వయంగా కొందరు ప్రజా ప్రతినిధులే చెప్పడం విశేషంగా ఉంది.మమ్మల్ని సమావేశానికి రమ్మని చెప్పి మేము వచ్చేలోపే సమావేశాన్ని ముగిస్తే ఎలా అంటూ ఓ ఎంపీటీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈఓఆర్డి ఫక్రుద్దీన్ ను వివరణ కోరగా ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రజా సమస్యలపై చర్చించటానికి వీలులేదని అందుకే త్వరగా సమావేశాన్ని ముగించామని గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే అధికారులు రాతపూర్వకంగా అర్జీ ఇచ్చినట్లయితే జిల్లా అధికారులకు పంపిస్తామని ఈ ఓఆర్డి అన్నారు.