PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు ఎమ్మెల్యేకు ఫోన్..స్పందించిన ఎమ్మెల్యే

1 min read

-పైపులను దొంగలించిన వారిని వదిలిపెట్టేది లేదు -18 వ వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే జయసూర్య -పట్టణంలో డ్రైనేజీ అస్తవ్యస్తం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 18 వ వార్డు కోటా వీధిలో ఉన్న మహిళలు త్రాగునీటి పైపులను దొంగలించారని ఈ సమస్య వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్వయంగా కాలనీ మహిళలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య కు మంగళవారం సా.5 గంటలకు ఫోన్ చేసి చెప్పారు.మరుసటి రోజున గురువారం ఉదయం పట్టణంలో 18వ వార్డులో మున్సిపాలిటీ కమిషనర్ టి సుధాకర్ రెడ్డి మరియు వార్డు కౌన్సిలర్ ఉండవల్లి ధర్మారెడ్డి తో కలిసి ఎమ్మెల్యే వార్డులో పర్యటించారు.వార్డు మహిళలతో ఎమ్మెల్యే మాట్లాడారు.మేము ఓట్లు వేయలేదనే కారణంతో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో త్రాగునీటి పైపులను కోసుకొని పైపులను దొంగలించారని మా కాలనీ కి నీళ్ళు రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు మహిళల విన్నవించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓట్లు వెయ్యలేదని త్రాగునీటి పైపులను అన్నీ తెలిసిన వారే దొంగతనం చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని దొంగతనం చేసిన వారు ఎవరో కమిషనర్ చెప్పాం వారి పైన ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే కమిషనర్ ను ఆదేశించారు.ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు వాళ్లు తప్పించుకు పోవాలని చూస్తున్నారని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి నడిబొడ్డున ఉన్న ఈ కాలనీలో దొంగతనం ఎలా జరుగుతుందని పట్టణం దుస్థితి ఈ విధంగా ఉందని పట్టణంలో త్రాగునీటి మరియు డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వాటి అవినీతిని అరికట్టే విధంగా పనిచేస్తానని ప్రజలు నాకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు.ఎమ్మెల్యే పరిశీలించిన కాలనీలో డ్రైనేజీ మురుగు నీరు రోడ్డుపై అతి తీవ్రంగా ఉండటం వల్ల దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయని దుర్వాసన భరించలేక పోతున్నాం అంటూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తొలగించరని అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు.వెంటనే ఈ డ్రైనేజీని తొలగించాలని ఎమ్మెల్యే కమీషనర్ ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్,పట్టణ టిడిపి అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మారుతి నగర్ అయ్యన్న,pallమల్లికార్జున రెడ్డి,వేణు, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

About Author