మహిళలు క్రమశిక్షణతో కలిగిన విద్య నభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
1 min readమహిళా సాధికారత పై చర్చ
పాల్గొన్న కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్, మహిళా పోలీసులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదపాడు శాఖా గ్రంధాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళా సాధికారతపై చర్చ” పెదపాడు జూనియర్ కాలేజీలో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమమునకు జూనియర్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎం.శ్రీనివాస్, కాలేజీ లైబ్రేరియన్ జి.పుల్లయ్య నాయుడు, పెదపాడు మహిళా పోలీస్ చుక్కమ్మ మరియు సచివాలయం మహిళా పోలీస్ అరుణదేవి, లక్ష్మీ శాంతి పాల్గొనినారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ విద్యార్థినిలు క్రమశిక్షణ కలిగిన పౌరులుగా మెలగాలి అని చెడు అలవాట్లకు పోకుండా మంచి ఉన్నత స్థితికి చేరుకోవాలని,మహిళలు ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని, ఉద్యోగంలో,రాజకీయంలో కుటుంబ బాధ్యతల్లో మహిళలు సాధికారత సాధించాలని తెలియజేసినారు. అనంతరం జూనియర్ కాలేజీ విద్యార్థిని, విద్యార్థులకు”గ్లోబల్ వార్మింగ్ వలన తలెత్తే పరిణామాలు నివారణ చర్యలు”గురించి వ్యాసరచన మరియు వకృత్వం పోటీలు నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చరర్స్ పాల్గొనినారు. విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం గ్రంథాల అధికారి దుగ్గుపోగు జాన్ బాబు పర్యవేక్షణలో నిర్వహించడం జరిగినది. వచ్చిన అతిధిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.