PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బారులు తీరిన మహిళా ఓటర్లు..

1 min read

మొబైల్ వెలుతురులోనే ఎన్నికల విధులు

ఉప్పలదడియలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 19 పంచాయితీల్లో సోమవారం జరిగిన ఎన్నికల్లో మహిళలు యువకులు మరి ప్రజలు ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉ.7 గం.కు ప్రారంభం కావలసిన పోలింగ్ కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం అయింది.తర్వాత కూడా కొన్ని ఈవీఎంలు నిదానంగా పనిచేస్తూ ఉండడంతో వరుసలో నిలబడిన మహిళలు ఓటర్లు నిరుత్సాహానికి గురయ్యారు.ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు వరుసలో చాలా దూరంగా నిల్చున్నారు.నిన్న సా.4:30 కు వర్షం రావడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. కరెంట్ రాకపోవడంతో  అధికారులు సెల్ ఫోన్ వెలుతురులోనే విధులు నిర్వర్తించారు.కానీ కరెంట్ రాత్రి కూడా రాకపోవడంతో అధికారులు ఇబ్బందులకు గురయ్యారు.నంద్యాల టిడిపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని కాతా రమేష్ రెడ్డి,తువ్వా భగీరథ రెడ్డి లతో కలిసి పరిశీలించారు.ఉప్పలదడియలో 30 వ పోలింగ్ బూత్ లో  మ.1:30 కు ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణంలో చోటుచేసుకుంది. మండలంలో ఎలాంటి సమస్యలు జరగకుండా ఎస్ఐ జగన్మోహన్ పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలిస్తూ గ్రామాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఎంపీడీఓ ఎస్ గంగావతి,మండల విద్యాశాఖ అధికారి రామిరెడ్డి తదితర అధికారులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

About Author