మహిళల ఆత్మరక్షణ కోసం మార్సల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యం.. డా. శంకర్ శర్మ
1 min readకొండారెడ్డి బురుజు వద్దనున్న పార్క్ ఆవరణలో
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తైక్వాండో శిక్షణ శిభిరాన్ని డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించి తైక్వాండో కోచ్ లకు ట్రాక్ షూట్, వేయింగ్ మిషన్,తైక్వాండో కిట్లను పంపీణీ చేశారు. ఈసందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మార్సల్ ఆర్ట్స్ లో బాలబాలికలకు శిక్షణ ఇవ్వడం శుభపరిణామం అన్నారు. దేశం మొత్తం అన్ని విద్యాసంస్థల్లో మహిళలకు, బాలికలకు తప్పనిసరిగా మార్సల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పించాలన్నారు. ఇందుకోసం ప్రతి విద్యా సంస్ధలో వ్యాయమ ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. ఓఅమ్మాయి ఇంటి నుంచి బయటకువచ్చి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకొగల విశ్వాసం మార్సల్ ఆర్ట్స్ వల్లే వస్తుందని తెలిపారు.మార్సల్ ఆర్ట్స్ లో యోగా, ధ్యానం, ప్రాణాయామం, వ్యాయామం ఉంటుందని దీని వల్ల విద్యార్థులకు ధైర్యం వస్తుందన్నారు.చిన్న పిల్లలే దేశ సంపద అని వారికి చిన్న తనం నుంచే క్రమశిక్షణ నేర్పించలన్నారు. ఇతర దేశాల్లో క్రమశిక్షణ లేనందునే యుద్దాలు వస్తున్నాయని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. చిన్నారులు సెల్ ఫోన్ కు అంకితం అవుతున్నారని వారిని సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలన్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు సైతం వస్తున్నాయన్నారు. విద్యార్థులను వివిధ క్రీడల్లో పాల్గొనేలా చేయడంవల్ల వారిని చేడు అలవాట్ల నుంచి రక్షించ వచ్చని డాక్టర్ తెలిపారు. చిన్నారులు ఉన్నతంగా ఉంటే దేశం ఎంతో బాగుంటుందని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈకార్యక్రమంలో తైక్వాండో శిక్షకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఈసందర్భంగా చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు.