కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం పని చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : అసెంబ్లీ మొదటి సమావేశంలోనే కర్నూలు జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల MLA లు అభివృద్ధి పనుల ప్రణాళికను ప్రవేశ పెట్టాలి.BCY పార్టీ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి ఎల్లార్తి అర్జున్ డిమాండ్.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరగబోయే మొదటి అసెంబ్లీ సమావేశం నుంచే కర్నూలు జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనులను ఒక ప్రణాళిక తయారుచేసుకుని చట్ట సభల్లో MLA లు వినిపించాలనీ,ముఖ్యంగా రాయలసీమలో వున్నటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజలకు సాగునీరు అందించేలా అలాగే ఎక్కడ చూసిన తాగునీటి సమస్యలు వుండటంతో అన్ని గ్రామాల్లో కూడా తాగునీటి సమస్యను లేకుండా చేయాలనీ,మార్మూల ప్రాంతం,వెనుక బడిన ప్రాంతం ఆలూరునియోజకవర్గం కాబట్టి పారిశ్రమలు,పెట్టుబడులు,విధ్యా, వైధ్యం,క్రీడాకారుల కోసం ఇండోర్ స్టేడియం,వేదావతి,నగరడొణ రిజైర్వర్ కొరకు నాయకులు కృషి చేసి NDA కూటమి సహాయ సహకారంతో ఆలూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాము.పశ్చిమ ప్రాంతంలో వున్నటువంటి కర్నూలు జిల్లాను మరియు జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అందరి కష్టాలు చూశారు కాబట్టి ఇక్కడ వున్న సమస్యలను మీరు NDA కూటమి సహాయ సహకారంతో మన జిల్లాను అభివృద్ధి కోసం కృషి చేయాలని భారత చైతన్య యువజన పార్టీ తరుపున కోరుకుంటున్నాము.