విద్యాలయాల ఏర్పాటుకు కృషి చేయండి – ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆదోని: ఆదోని అసెంబ్లీలో 5 ప్రభుత్వ హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదోని శాసనసభ్యులు పార్థసారధి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ని కోరారు. బుధవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ సమయంలో ఎమ్మెల్యే పార్థసారథి మంత్రి నారా లోకేష్ ని కలిసి ఆదోని అసెంబ్లీలో నూతనంగా ఏర్పాటు చేయాల్సిన విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం వల్ల ఆదోని పట్టణంలో ఉన్న ఏడెడ్ ఉన్నత పాఠశాలలో మూతపడ్డడం విచారకరమన్నారు. అలాగే ఆదోని మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఏర్పాటు చేసే ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి విద్యాలయాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.