PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పని చేద్దాం

1 min read

– చెన్నూరు మండలాన్ని మోడల్ మండలం గా తీర్చి దిద్దుద్దాం

– మండల సర్వసభ్య సమావేశంలో

 – ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి చెన్నూరు మండలాన్ని మోడల్ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు, బుధవారం స్థానిక మండల సబా భవనం నందు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు, ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మండల ప్రజలకు తాను ఏవైతే హామీలు ఇచ్చాను వాటన్నిటిని నెరవేర్చే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు, ముఖ్యంగా త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు విషయంలో అధికారులు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో గుర్తించి వాటన్నిటిని తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు, అదేవిధంగా చెన్నూరు కొత్త రోడ్డు వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా ఇండ్లు ఇళ్ల స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇంతవరకు ఎందుకు ఇంటి స్థలాలు గాని, వారికి పక్కా గృహాలు గాని మంజూరు చేయలేదని ఆయన తాసిల్దార్ ప్రకాష్ బాబును ప్రశ్నించారు, వీలైనంత తొందరగా వారికి ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా చూడాలని తెలిపారు, అలాగే చెన్నూరు కేసీ కెనాల్ మెయిన్ కాలవకు కాలువ ఇరువైపులా ఉన్న వారు తమ బాత్రూములకు సంబంధించిన మురుగు నీటిని కాలువలలోకి వదులుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు, వారందరికీ తక్షణమే నోటీసులు ఇచ్చి పది రోజులలోగా కాలువలోకి నీళ్లు వదలకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని ఆయన పంచాయతీ కార్యదర్శి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు దీనిపై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఆయన వారిని ఆదేశించారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీ హెచ్ సీ) సంబంధించి స్థలం మంజూరు చేయించాలని అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని రైతులు తమ వద్దకు రావడం జరిగిందని, చుక్కల భూములకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన తాసిల్దార్ కు తెలిపారు, అలాగే మండలంలోని రాచినాయపల్లె లో త్రాగునీటి సమస్య ఉందని పెన్నా నది నుండి, రాచనాయపల్లి వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు పైపులైనున్నందున తరచు ఆ పైపులై లీకేజీల కారణంగా తమ గ్రామానికి త్రాగునీటి సమస్య ఉత్పన్నమవుతున్నదని రాచినాయపల్లి సర్పంచ్ సొంతం నారాయణరెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, ఆయన వెంటనే స్పందించి త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులను ఆదేశించారు, అదేవిధంగా మండలంలోని రామనపల్లె గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ స్థల విషయమై చాలా రోజులుగా తహసిల్దార్ ను అడగడం జరుగుతుందని గతంలో అనుకున్న స్థలం కోర్టులో ఉన్నందున తమకు ప్రత్యామ్నాయంగా స్థలం కేటాయిస్తే విద్యుత్ సబ్ స్టేషన్ కు నిధులు ఉన్నాయని అక్కడ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మిస్తే కరెంటు సమస్యలను అధిగమించవచ్చని ట్రాన్స్కో ఏ ఈ రామలింగారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, స్పందించిన ఎమ్మెల్యే వెంటనే తాసిల్దార్ ను  స్థల కేటాయింపు చూడాలని ఆదేశించారు, అయితే ఈ విషయమై  ముండ్లపల్లె కుచెందిన మణికంఠ అనే రైతు తమ పొలం అర్థ ఎకరా సబ్ స్టేషన్కు ఇవ్వడానికి ముందుకు రావడంతో, ఆ స్థలాన్ని పరిశీలించాలని రెవిన్యూ అధికారులను, ట్రాన్స్కో అధికారులకు తెలిపారు, మండలంలో ఎక్కడెక్కడ ఏ ఏ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయో ఆ పనులకు సంబంధించిన సమగ్రమైన సమాచారంతో తన వద్దకు ఆయా అధికారులు రావాలని వాటన్నిటిని పరిశీలించి పనులు కొనసాగేందుకు అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఆయన అధికారులకు తెలియజేశారు, అదేవిధంగా చెన్నూరుపోలీస్ స్టేషన్ వద్దనుండి పాత బస్టాండ్ వరకు ఏవైతే రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలకు గురయ్యాయో వాటన్నిటిపై సర్వే నిర్వహించి వెంటనే తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు,

…..నేషనల్ హైవే అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే………….

జాతీయ రహదారి అధికారుల తీరు బాగోలేదని

జాతీయ రహదారి నిర్మించి టోల్గేట్ పెట్టి డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప అక్కడి ప్రజల పట్టించుకున్న దాఖలాలు లేవని కనీస అవసరాలు కూడా తీర్చలేని విధంగా నేషనల్ హైవే అధికారుల తీరు ఉందని ఇలాగైతే టోల్గేట్ మూసివేయాల్సి వస్తుందని హైవే అధికారులకు తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు, చెన్నూరు కొత్త రోడ్డు వద్ద ఇప్పటివరకు బస్ షెల్టర్ గాని, సర్వీస్ రోడ్లు గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని పట్టించుకున్న పాపాన పోలేదని  నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు ప్రమాదవశాత్తు గాలిలో కలిసిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, ఇంతటి నిర్లక్ష్యానికి గురైన హైవే అధికారుల మీద 307 కేసు ఎందుకు పెట్టకూడదని ఆయన నేషనల్ హైవే అధికారులను ప్రశ్నించడం జరిగింది, గతంలో జరిగినవవేవో జరిగిపోయాయి, అప్పటినుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క తప్పు చేసిన ఎవరినైనా ఉపేక్షించేది లేదు ఎన్ని రోజులలో నేషనల్ హైవే పెండింగ్ పనులు పూర్తి చేస్తారో కచ్చితంగా చెప్పాలని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, ఒకవేళ మీరు చెప్పిన సమయానికి చెప్పినట్లుగా పనిచేయకపోతే సహించేది లేదని ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు, 4 కోట్ల50 లక్షల రూపాయలతో చేపడుతున్న సామాజిక ఆరోగ్య కేంద్రం( సి.హెచ్ సి) నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యత లేదని తన దృష్టికి వచ్చిందని ఏవైతే నాణ్యతలేవో అధికారులు నిర్దేశించి తనకు తెలియజేయాలని ఆయన అన్నారు, అలా కాకుండా తానే ఆ నిర్మాణాలకు వెళ్లి నాణ్యతగా లేకుండా ఉంటే మాత్రం ఉపేక్షించేది లేదని అలాంటి అధికారులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు, మండల అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో ఏవైతే ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారో ఆ సమస్యలన్నిటిని కూడా మళ్లీ వచ్చే సమావేశానికల్లా పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు, ఈ కార్యక్రమంలోఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్,ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం శర్మ, తహశీల్దార్ ప్రకాష్ బాబు, టిడిపి మండల కన్వీనర్ కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ బి చెన్నారెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ వంశీకృష్ణ, ట్రాన్స్కో ఏ ఈ రామలింగారెడ్డి, పి ఆర్ డి ఈ మురళి, ఎంఈఓ గంగిరెడ్డి, ఏ పీ ఓ శైలజ, ఏవో శ్రీదేవి, ఐసిడిఎస్ సిడిపిఓ రమాదేవి, వెటర్నరీ డాక్టర్ ఉపేంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఏపిఎం గంగాధర్, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

About Author