ఆర్టీసీని బ్రతికించడానికి కార్మికులు అహర్నిశలు పనిచేస్తున్నారు..
1 min readవారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది అని ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు
పల్లెవెలుగు వెబ్ ఆదోని: ఈరోజు ఆదోని ఆర్టీసీ డిపో లో ఆదోని-బెంగళూరు సర్వీస్ కు సంబంధించిన నూతన బస్సును డిపో మేనేజర్ ఎం.డి రఫీక్ తో కలిసి ప్రారంభించారు అలాగే ఆర్టీసీ ఉద్యోగస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైనా పొరపాటు జరిగినపుడు ఆర్టీసీ ఉద్యోగస్తులను నిందించడం సరికాదని,ప్రాణాలను పణంగా పెట్టి డ్రైవర్లు ఇబ్బందితో దూర ప్రాంతాల నుంచి డ్రైవింగ్ చేస్తూ కొంత అసహనానికి గురైనప్పుడు ప్రజలు, ప్రయాణికులు కొంత సంయమనం పాటించి వారికి ఇవ్వాలని కోరారు. వీలైనంతవరకు ప్రజలందరూ కూడా ఆర్టీసీలో ప్రయాణం చేయడం శ్రేయస్కరమని, ప్రయాణికులకు భద్రత కల్పించడంలో ఆర్టీసీ ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు అలాగే ప్రజల అవసరాలకు తగ్గట్టు ఇంకా ఎక్కువ బస్సులు పెంచాలని ఉన్నతాధికారులను కలిసి మాట్లాడతానన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థ ం ఫిట్నెస్ లేని బస్సులను నడపకుండా వాటిని పూర్తిగా ఫిట్మెంట్ చేయించిన తర్వాతనే ప్రయాణానికి వాడాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్టీసీ డిపో ఉద్యోగస్తులు,కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.