విభిన్న ప్రతిభావంతుల హక్కుల కోసం కృషి
1 min readతమ సమస్యలు రాతపూర్వకంగా ఇవ్వండి
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: విభిన్న ప్రతిభావంతుల హక్కుల కోసం తన వంతు కృషి చేస్తానని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల)దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు ఏ సమస్య వచ్చినా రాతపూర్వకంగా తన కు ఇవ్వాలని కోరారు. మీ సమస్యల పరిష్కారం కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ల ద్వారా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించి వారికి ఆసరానివ్వడం కోసం సహయ సహకారాలు అందించాలని సూచించారు. వారు గౌరవంగా జీవిస్తూ సాధారణ జనజీవనంలో భాగమై అన్ని హక్కులు పొందేలా చూడడంకోసం మన వంతు కృషి చేసి వారికి అండగా నిలవాలని అధికారులకు, ప్రజలకు సూచించారు. అనంతరం వారి కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని రాఘవేంద్ర రెడ్డి దివ్యంగులకు వడ్డించారు.ఈ కార్యక్రమంలో యంఈఓ మొయినుద్దిన్, ఎస్ఐ పరమేష్ నాయక్, ప్రధానోపాధ్యాయులు హంపయ్య, స్థానిక టిడిపి నాయకులు అశోక్ రెడ్డి, వరదరాజులు, ఎంపిటిసి మేకల వెంకటేష్ , డీసీ తిమ్మప్ప,నరసింహ, శివ,మేకల నరసింహులు, రాఘవేంద్ర, కల్లుదేవకుంట రాఘప్ప, బంగారయ్య, పెద్దయ్య, టిడిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.