ఐక్యంగా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి
1 min readఏపీయూడబ్ల్యూజే తాలుకా కమిటీ
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: ఐక్యంగా ఉండి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఏపీయూడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు జయరాజు, ప్రధాన కార్యదర్శి ఉసేని, కోశాధికారి సాబువలి, ఆర్గనైజింగ్ కార్యదర్శి సూర్యనారాయణ లు అన్నారు. మంగళవారం మంత్రాలయంలోని అబౌడి హోటల్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ,జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఏపీయూడబ్ల్యూజే మండల గౌరవ అధ్యక్షులు రానోజి రావు అధ్యక్షతన నాలుగు మండలాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన సమస్యలైన జర్నలిస్టుల ఇళ్ళు స్థలాలు , ఆక్రిడేషన్ , నాలుగు మండలాల్లో నూతన ప్రెస్ క్లబ్ లను త్వరగా ఏర్పాటు సమస్యల పై చర్చించారు. పై సమస్యలను జిల్లా దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానన్నారు. ఇప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మండలాల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని,పలు సమస్యలు పై చర్చించి , తాలుకా కమిటీ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపియూడబ్య్లూజే తాలుకా ఉపాధ్యక్షులు రాఘవేంద్రగౌడ్ , మంత్రాలయం , కోసిగి మండలాధ్యక్షులు భీమరాయ్ , షబ్బీర్ , ఉపాధ్యక్షులు కంతం నరసింహ , ఎనుముల ఈరన్న , ప్రధాన కార్యదర్శి వడ్డే.వెంకటరాజ్ , కోశాధికారి రఫి , సభ్యులు వీరేష్ , మైబు , తదితరులు ఉన్నారు.