డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం విజయవంతం చేయాలి
1 min readడాక్టర్:ఎస్ శర్మీస్ట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
29,30 తేదీలలో ప్రజలకు ఎయిడ్స్ (హెచ్ఐవి) సుఖ వ్యాధులు, టీబీ వ్యాధులపై అవగాహన
డాక్టర్:ఎం నాగేశ్వరరావు జిల్లా లెపర్సీ, ఎయిడ్స్ & టిబి అధికారి
నేడు ట్రాన్స్ జెండర్ లకు, హెచ్ఐవి బాధితులకు ముగ్గుల పోటీలు, కొవ్వొత్తుల ప్రదర్శన
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశముల మేరకు ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ 1వ తేదీ ప్రతీ సంవత్సరం ప్రజలకు అవగాహన కల్పించేదుకు అనేక కార్యక్రమములు నిర్వహించడము జరుగుతుంది. కార్యక్రమాలలో బాగంగా జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆద్వర్యం లో 29 వ తేదీ మరియు 30 వ తేదీ రెండు రోజుల పాటు ప్రజలకు “హెచ్.ఐ.వి/ఎయిడ్స్” సుఖవ్యాధులు మరియు టి.బి వ్యాధులపై అవగాహన కల్పించేందు ఒక సమాచార ప్రచార కేంద్రమును (IEC Stall) ఏలూరు కొత్త బస్ స్టాండ్ నందు ఏర్పాటు చేశారు. ఈ సమాచార ప్రచార కేంద్రమును డా.ఎస్. శర్మిష్ట, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మరియు డా. ఎమ్. నాగేశ్వర రావు, జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి వారు ప్రారంబించారు. ఈ సందర్బంగా డా:ఎస్. శర్మిష్ట, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి వారు మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినము సందర్బంగా జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమములు మరియు “హెచ్.ఐ.వి/ఎయిడ్స్” పై విస్తృత ప్రచారము చేస్తున్నామని తెలియజేశారు. డా. ఎమ్. నాగేశ్వర రావు, జిల్లా లెప్రసి, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి వారు మాట్లాడుతూ 30వ తేదీనాడు సాయంత్రం 3 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము ప్రాంగణములో ట్రాన్స్ జెండర్లకు మరియు హెచ్.ఐ.వి భాదిత మహిళాలకు వారి కుటుంబ సభ్యులకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని అనంతరం కొవ్వొత్తులతో ప్రదర్శన ఉంటుందని, డిసెంబర్ 1వ తేదీన వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయములో ఉదయం 8.30 గంటలకు సమాజం వివక్షత తగ్గించే లక్ష్యంతో హెచ్.ఐ.వి బాదిత పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, ట్రాన్స్ జెండర్లు మరియు జిల్లా అధికారులతో కలిపి సామూహిక అల్పాహారము చేసే కార్యక్రమము నిర్వహిస్తామని, తదుపరి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, స్వచ్చంద సంస్థల సిబ్బందితో, విద్యార్దిని విద్యార్దులతో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, ఏలూరు జిల్లను “హెచ్.ఐ.వి/ఎయిడ్స్” రహిత జిల్లాగ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమములో పి, బాలాజీ, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్, ఎన్. హరినాధ రావు, జిల్లా సూపర్వైసర్, స్వచ్చంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.