“ప్రపంచ జోనోసిస్ డే”
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మానవత మహిళా విభాగం ఆధ్వర్యంలో “ప్రపంచ జోనోసిస్ డే” సందర్భంగా విద్యార్థులకి అవగాహనా కార్యక్రమం…..పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కార్తిక అన్నారు. శనివారం స్థానిక రవీంద్ర విద్యా నికేతన్ యందు విద్యార్థులకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అకడమిక్ అడ్వైజర్ మమత అధ్యక్షతన అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ మాట్లాడుతూ పెంపుడు జంతువులు మనుషులు ఎడల ఎంతో ప్రేమగా కుటుంబంలో ఒక సభ్యుడుగా ఉంటాయని యజమానులు ఎప్పుడు జంతువుల ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధుల గురించి విదిగా అవగాహన కలిగి ఉండాలని, వాటిని నిరంతరం శుభ్రంగా ఉంచాలని, క్రమం తప్పకుండా వాక్సిన్ వేయించాలని అన్నారు. మానవతా మహిళా విభాగం కన్వీనర్ యాని ప్రతాప్ మాట్లాడుతూ ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ రేబిస్ వ్యాధికి వ్యతిరేకంగా 1885లో రేబిస్ వ్యాక్సిన్ ని విజయవంతంగా ఈరోజు ఇవ్వడం జరిగింది అని అందువల్లనే ప్రజలందరికీ అవగాహన కలిగించేందుకు జూలై 6 ను ప్రపంచ జోనోసిస్ డే గా ప్రకటించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యానికేతన్ ప్రిన్సిపల్ స్వాతి, మానవత ప్రెసిడెంట్ అపర్ణ, జనరల్ సెక్రెటరీ దీప, సభ్యులు మంజుల తదితరులు పాల్గొన్నారు.