PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“ప్రపంచ పొగాకు వ్యతిరేక  దినోత్సవం”అవగాహన ర్యాలీ 

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  “ప్రపంచ పొగాకు వ్యతిరేక  దినోత్సవం సందర్భముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి  డా. వై. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యములో అవగాహన ర్యాలీ  జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి కార్యాలయం నుండి ప్రభుత్వ సర్వజన వైద్యశాల వరకు నిర్వహించడం జరిగినది.  ఈ కార్యక్రమములో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మే 31 వ తేదీన “ప్రపంచ పొగాకు వ్యతిరేక  దినోత్సవం జరుపుకొంటున్నామని అందులోభాగంగా ఈ సంవత్సరం “పొగాకు ఉత్పత్తుల పరిశ్రమల నుండి పిల్లలను కాపాడుదాం” అను నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ధూమపానం వలన క్యాన్సర్ , ఊపిరితిత్తుల వ్యాదులు , గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నదని కాబట్టి ధూమపానం మానడం వలన ఈ క్రింద తెలిపిన ఉపయోగాలున్నాయని  తెలిపారు.దూమపానం మానడం వలన ఉపయోగాలు:-గుండె జబ్భుల ప్రమాదం తగ్గును క్యాన్సర్ కు గురికాకుండుటరక్తపోటు నియంత్రణ లో ఉండును రక్త ప్రసరణ సక్రమంగా జరుగును రుచి ,వాసనల గ్రహణ శక్తి మెరుగు పడును రక్తంలో అధిక  ప్రాణవాయువు ప్రసారంత్వరగా అలసటకు గురికాకుండుట మీరేకాకుండా , మీ కుటుంభ సభ్యులు కూడా లాభపడుదురు తదుపరి ప్రభుత్వ సర్వజన వైద్యశాల దగ్గర “పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ” చేసారు . ఈ కార్యక్రమం లో DLATO డాక్టర్ భాస్కర్ , PO RBSK & NCD హేమలత   DPMO డాక్టర్ ఉమా , DEMO ప్రమీలాదేవి, HEEO శ్రీనివాసులు , డిప్యూటీ డెమో చంద్రసేకర రెడ్డి , ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ సుధాకర్, ఎపిడమాలజిస్ట్ వేణుగోపాల్, NTCP స్టాఫ్  సైకాలాజిస్ట్ చంద్రశేఖర్ , సోషల్ వర్కర్ సోమశేఖర్ స్వామి , DCM ప్రసాద్, HE పద్మావతి , మానిటరింగ్ కన్సల్టెంట్ సుమలత , RKSK కన్సల్టెంట్ మల్లికార్జున ,ఆశా కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

About Author