ఘనంగా ప్రపంచ ఫిజియాలజీ వారోత్సవాలు”
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మెడికల్ కాలేజీ యందలి ఫిజియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 22 వరకు ప్రపంచ ఫిజియాలజి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా 19న ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ యందు విద్యార్థులకి ఆవగాహన కార్యక్రమాలు , 21న మెడికల్ కాలేజీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాలు, 22 పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు కర్నూలు మెడికల్ కాలేజి మొట్ట మొదటి ప్రిన్సిపాల్ & మొదటి ఫిజియాలజీ డిపార్ట్మెంట్ హెచ్.ఓ.డి & ప్రొఫెసర్ డా.సి. వెంకట రామయ్య విగ్రహానికి ఇన్చార్జి మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ హరి చరణ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సుధీర్ ప్రొఫెసర్ అండ్ హెచ్. ఓ . డి. డా.అమీరున్నీసా బేగం లు పూలు మాల వేసి స్మరించు కోవడం జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో వివిధ పోటల్లో గెలుపొందిన విద్యార్థులకు ఇంచార్జీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, హెచ్.ఓ.డీ ల చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవి లత, డాక్టర్ ఎలిజిబెత్ రాణి, డాక్టర్ బేబి సాయి రాణి, డా.ఉమ, డా. సోఫియా డిపార్ట్మెంట్ సిబ్బంది కలిసి ప్రపంచ ఫిజియాలజీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.