PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయతీ రాజ్ శాఖ ప్రపంచ రికార్డు సాధించడం హర్షనీయం

1 min read

ఒకే రోజు 13,326 గ్రామపంచాయతీలలో గ్రామసభలు

ఏలూరు జిల్లాలో 547 గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించాo

హర్షం వ్యక్తం చేసిన జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా ఆగష్టు 23వ తేదీన ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించగా ఏలూరు జిల్లాలో  పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో ఏలూరు జిల్లాలో 547 గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించడం జరిగింది. సందర్బంగా ఉపాధి గ్రామీణ హామీ పథకంలో చేపట్టే పనులను పంచాయతీ అభివృద్ధి కోసం గుర్తించడం జరిగింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఉపముఖ్యమంత్రి & పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆచరణలోకి తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. ఈ ప్రపంచ రికార్డుతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *