వర్షం కోసం లింగమయ్య స్వామికి పూజలు ..
1 min readపల్లెవెలుగు న్యూస్, గడివేముల : రెండు నెలలు గడుస్తున్న సరైన వర్షాలు లేకపోవడంతో వర్షాలు కురవాలని గడివేములలోని కురువ సామాజిక వర్గం ఆధ్వర్యంలో గత తొమ్మిది రోజుల నుంచి వర్షం కోసం కుల దైవం బీరప్ప స్వామి దేవాలయం నుంచి లింగమయ్య స్వామి అరుగు వద్దకు డప్పు వాయిద్యాల నడుమ పుర వీధుల్లో ఊరేగుతూ లింగమయ్య స్వామి వద్దకు చేరుకుని లింగమయ్యకు జలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాటితో 9 రోజులు జరిగిన ఈ కార్యక్రమం ముగిసినట్టు పెద్దలు తెలిపారు . సరైన వర్షం లేని సమయంలో వర్షం కోసం లింగమయ్య స్వామికి పూజలు చేయడం ఆనవాయితీ అని తెలిపారు.