యం.బి యెరూషలేం.. అసెంబ్లీ చర్చ్ లో క్రిస్మస్ పండుగ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో యం.బి యెరూషలేం, అసెంబ్లీ చర్చ్ ల నందు క్రిస్మస్ పండుగ వేడుకలను ఎంతో ఆహ్లాదకరంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలలో బుట్టా ఫౌండేషన్ అధినేత మరియు వైఎస్ఆర్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక భర్త శ్రీ బుట్టా శివనీలకంఠ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి , విరశైవ లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు వై. రుద్రగౌడ్ , మరియు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరిమనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కామర్తి నాగేశప్ప, యాంకే శివ ప్రసాద్, సునీల్ కుమార్,రాజరత్నం,సుధాకర్, మాచని వెంకటేష్, మాధవ స్వామి, ఖిబ్రియా, మహబూబ్ బేగ్, షైక్ చాంద్, దేవరాజు, ప్రభాకర్, బంటుపల్లి ప్రభాకర్, పల్లవి రాజశేఖర్, కే. నరసన్న వంటి ప్రముఖులు పాల్గొన్నారు.