విద్యుత్ చార్జీల’పై 27న వైసీపీ పోరుబాట..
1 min readపోస్టర్లు విడుదల ‘పోరుబాట’ను విజయవంతం చేయండి:వైసీపీ..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట వాల్ పోస్టర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు విడుదల చేశారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపు మేరకు వైసీపీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూరు సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మంగళవారం వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు కోకిల రమణారెడ్డి కార్యాలయంలో మాజీ ఏఎంసీ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి, జూపాడుబంగ్లా జడ్పిటిసి పోచా జగదీశ్వర్ రెడ్డి,పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి,పట్టణ అధ్యక్షులు మన్సూర్ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ నెల 27వ తేదీన విద్యుత్ చార్జీల పెంపుపై నందికొట్కూరులో విద్యుత్ బాదుడుపై పోరుబాట చేస్తున్నట్లు వారు తెలిపారు.చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిన కూటమి ప్రభుత్వ పాలనను నిరసిస్తూ 27వ తేదీన నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నందికొట్కూరులో ర్యాలీ అనంతరం విద్యుత్ ఏడిఏ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరుగుతుందని వారు తెలిపారు.వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాయబ్,వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి,మాజీ సోసైటీ చైర్మన్ వైవీ రమణ,కోకిల రమణారెడ్డి,తిరుమల్ రెడ్డి,జబ్బార్,చింతా విజయ్‌కుమార్, గోవిందరెడ్డి,నాగశేనారెడ్డి పాల్గొన్నారు.