వైసీపీ ప్రభుత్వ అవినీతి తో పాలన గాడి తప్పింది..
1 min readవాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం
వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి అంతు తెలుస్తాం.. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఫైర్
గడివేములలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి చర్యలు
త్వరలో అలగనూరు రిజర్వాయర్ మోక్షం
పల్లెవెలుగు న్యూస్ గడివేముల : గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అధికారులు సూచించారు. బుధవారం నాడు మండల పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షురాలు నాగమద్దమ్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయంలో తాగునీటి కోసం నాసిరకంగా పైపుల నిర్మాణం చేపట్టారని ఇప్పుడైనా అధికారులు స్పందించి వెంటనే పైప్ లైన్ పూర్తి చేసి తాగునీటి సమస్య ఉన్న గ్రామాలలో సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గని, మంచాలకట్ట, పెసర వాయి, కరిమద్దల గ్రామాలలో రోడ్డుపైనే మురికి నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ నిర్మాణానికి ప్రతిపాదన పంపించాలని అధికారులను సూచించారు. వర్షాకాలం కావడంతో గ్రామాలలో డయేరియా రాకుండా ముందస్తు జాగ్రత్తగా రోడ్ల పైన మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. సర్పంచులకు వచ్చిన నిధులను గత ప్రభుత్వం లాగేసుకెందని. అభివృద్ధి పనులు కుంటూ పడ్డాయని. నియోజకవర్గ వ్యాప్తంగా వైసిపి చోటామోటా నాయకులు నుండి పెద్ద నాయకులు వరకు తమ బంధువుల పేరిట ప్రభుత్వ భూములు కబ్జా చేశారని వాటి అంతు తెలుస్తామని కమిటీ ఏర్పాటు చేసి బాధితులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గ్రామాలలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్పంచ్లకు వచ్చే నిధులను గ్రామాలను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వం ఒక్కరోజులోనే పింఛన్దారులకు పింఛన్ పంపిణీ చేసి చరిత్ర సృష్టించిందని . గత ప్రభుత్వం గని గ్రామ చెరువుకు తూము ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేశారని ఏర్పాటు చేసి ఉంటే రెండు వందల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. అలగనూరు రిజర్వాయర్ కట్ట మరమత్తు పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే రిజర్వాయర్ కట్ట పనులను త్వరలోనే ఇందులోని మంజూరు చేసి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గడివేములలో ట్రాఫిక్ సమస్య ఉన్నందువల్ల బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రోడ్ల భవనాల శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్లామని ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి తెలిపారు. ఎన్నికల ముందు వచ్చిన హామీల ప్రకారమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే పింఛను అందిస్తున్నారని మరియు గత నెల 8వ వ తేదీన ఉచిత ఇసుక పాలసీని ప్రారంభించారన్నారు. ఈనెల 15వ తేదీన అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక పథకాన్ని పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని తెలిపారు. కోర్ర పోలూరు గ్రామంలో 600 ఎకరాల పొలం కబ్జా గురైందని గ్రామ సర్పంచ్ మాలిక్ భాష ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ కమిటీని ఒక ఐఏఎస్ అధికారి ద్వారా విచారణ చేపడతారని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉన్నందువల్లే ప్రజలు ఓట్లు వేసి 164 స్థానాలలో ప్రజలు గెలిపించారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివరాంరెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ గురునాథం, ఏవో చంద్రశేఖర్, జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, గడివేముల సర్పంచ్ రవణమ్మ, ఎంపీటీసీ మహేశ్వర్ రెడ్డి, అన్ని శాఖల చెందిన అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మూల పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి నరేంద్రనాథ్ రెడ్డి. ఐ టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.