PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తోంది..

1 min read

క‌ర్నూలు టిడిపి అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్

ఎస్‌.పి-95 గ్రూప్ స‌భ్యుల ఆత్మీయ స‌మావేశంలో పాల్గొన్న టి.జి భ‌ర‌త్‌

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైసీపీ మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తోంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థి టి.జి భ‌ర‌త్ అన్నారు. మౌర్య ఇన్‌లోని ప‌రిణ‌య హాల్‌లో జ‌రిగిన ఎస్‌.పి-95 గ్రూప్ స‌భ్యుల ఆత్మీయ స‌మావేశంలో టి.జి భ‌ర‌త్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎస్‌.పి-95 గ్రూప్ స‌భ్యులు రానున్న ఎన్నిక‌ల్లో టి.జి భ‌ర‌త్‌కు మ‌ద్ద‌తు తెలుపుతామ‌ని ప్ర‌క‌టించారు. అనంత‌రం గ్రూప్ స‌భ్యుల‌ను ఉద్దేశించి టి.జి భ‌ర‌త్ మాట్లాడారు. గ‌త ఎన్నిక‌ల్లో ముస్లిం, క్రిస్టియ‌న్ అని కుల‌, మ‌తాల పేర్లు చెప్పి గెలిచిన వైసీపీ మ‌రోసారి అదే దారిలో గెల‌వాల‌ని చూస్తోంద‌న్నారు. అయితే ఈ ఐదేళ్ల‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్ర‌జ‌లు వైసీపీని న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌న్నారు. ప్ర‌జలంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. ఐదేళ్ల‌లో నిరుద్యోగం పెరిగిపోయింద‌న్నారు. ఉద్యోగ అవ‌కాశాలు లేక యువ‌త అల్లాడిపోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెప్పుకోద‌గ్గ ఒక్క ప‌రిశ్ర‌మ కూడా రాష్ట్రానికి రాలేద‌న్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తాయ‌న్నారు. కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామ‌ని చెప్పారు. ఐదేళ్ల‌లో క‌ర్నూల్లో అర్హుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అంద‌లేద‌న్నారు. అభివృద్ధి సైతం ఏమీ లేద‌న్నారు. ఇక చేసేదేం లేక వైసీపీ ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు అభ్య‌ర్థిని మార్చేసింద‌న్నారు. తాము 40 ఏళ్లుగా క‌ర్నూలు ప్ర‌జ‌ల‌కు నిస్వార్థంగా సేవ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్ర‌జ‌లు అవ‌కాశం ఇస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామ‌న్నారు. అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందాలంటే త‌న‌లాంటి స‌రైన వ్య‌క్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని.. క‌ర్నూల్లో త‌న‌ను గెలిపించి అభివృద్ధిలో భాగ‌స్వామ్యం అవ్వాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ కార్యక్రమంలో ఎం.సీ.ఆదేప్ప, నాగరాజు, బి.శ్రీనివాసులు ఎల్ల కృష్ణుడు, శ్రీను, నాగన్న ఎస్పీ-95 గ్రూప్ సభ్యులు మరియు టిడిపి నగర ఎస్సీ సెల్ నాయకులు శివ, ఏసన్న, కర్ణ, దినేష్ మహిళా నాయకురాలు శారదమ్మ, నాయకులు విక్ర‌మ్ సింగ్, శ్రీధ‌ర్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author