PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బుగ్గనకు ఘన స్వాగతం పలికిన వైసిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు  వెబ్ ప్యాపిలి :  వైసీపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ప్యాపిలి పట్టణ వైసిపి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం ఆయన రాకతో బాణాసంచాలు కాలుస్తూ, డప్పు వాయిద్యాలతో గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం  స్థానిక పట్టణంలోని బస్టాండు నుండి మెయిన్ బజార్ ద్వారా శ్రీరామ థియేటర్ కొరకు ర్యాలీగా వెళ్లారు. వీధుల్లో మధ్యలో ప్రజలను ఆప్యాయంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలకరిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరామ థియేటర్ కు చేరుకున్నారు. అక్కడ ఎర్రగుంట్లపల్లే వెంకటేశ్వర రెడ్డి, రజిని రెడ్డి, భూశెట్టి చిన్న సుంకయ్య ఆధ్వర్యంలో ప్యాపిలీ,కలచట్ల, ఎర్రగుంట్లపల్లే, నల్లబెల్లి గ్రామాల నుంచి మహిళలు, పురుషులు టిడిపి నుండి వైసీపీ లోనికి 300 కుటుంబాలు చేరగా వారిని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  వైసీపీ కండువలు కప్పి  పార్టీలోకి అందరినీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు వైసిపి  ర్యాలీ కోసం ప్రజలు, మహిళలు స్వచ్ఛందంగా వచ్చినందుకు  సంతోషంగా ఉందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరు సైనికుల పనిచేసి వైసీపీ పార్టీని ఆ ఖండ మెజార్టీతో గెలిపించి జగన్ సీఎం గా చేసుకుని  సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ అర్హులైన వారు అందుకోవాలని ఆయన తెలిపారు. అలాగే పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ప్రజలకు ఎప్పుడు నేను సేవకుడుగా ఉంటూ సేవలందిస్తూ ,వెన్నంటే ఉంటానని ఏ సమస్య వచ్చినా తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ చైర్మన్ శ్రీరాములు, జడ్పిటిసి బోరె రెడ్డి శ్రీరామరెడ్డి, మాజీ జెడ్పిటిసి దిలీప్ చక్రవర్తి, మండల వ్యవసాయ సలహా చైర్మన్ మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, మండల కన్వీనర్ పోతుదొడ్డి కృష్ణమూర్తి, వైసీపీ నాయకులు బోర మల్లికార్జున రెడ్డి, బోర్ రెడ్డి పుల్లారెడ్డి, చిన్నప్పు జిల్లా రామచంద్రారెడ్డి, గజేంద్ర రెడ్డి,సింగల్ విండో అధ్యక్షుడు బోరెడ్డి రామచంద్రారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గడ్డం  భువనేశ్వర్ రెడ్డి, రాజా మురళి కృష్ణ, గండికోట చిన్న రామాంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, బషీర్, బోరెడ్డి ప్రభాకర్, రెడ్డి, బో రెడ్డి రఘునాథ్ రెడ్డి, జకీర్, యాదాటికిష్టప్ప, రాము, రామకృష్ణ ,సోమశేఖర్, నారాయణ,  రాముడు, మరియు భూశేట్టి బ్రదర్స్, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author