వైసీపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి
1 min readవైయస్ జగన్మోహన్ రెడ్డిని మరో మారు అధికారంలోకి తీసుకురావాలి
ఏలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: లంచాలు, అవినీతి, దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ ఫలాల లబ్దిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, ఈనెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైసిపి ప్రభుత్వాన్ని, వైయస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని 27, 28, 29, 30, 31, 32 డివిజన్ల కు చెందిన ప్రజలతో ఆళ్ల నాని సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాలని, సంక్షేమం, అభివృద్ధి దూరం చేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు పాలనలో అన్ని మోసాలేనని, ప్రజలకు ఏ విధమైన మేలు జరగలేదన్నారు. మీకు మేలు చేశానంటే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు ఆలనాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, ఏపీ హిస్టరీ అకాడమీ డైరెక్టర్ మహమ్మద్ ఖైజర్, డిప్యూటీ మేయర్లు గుడిదేశీ శ్రీనివాస్, నూకపెయ్యి సుధీర్ బాబు, ఏఎంసి చైర్మన్ నేరుసు చిరంజీవిలు, మాజీ చైర్మన్ మంచెం మై బాబు, కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,మున్నుల జాన్ గుర్నాథ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బి. మోహన్, కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు, నాయకులు రేకపల్లి నారాయణ, బనిశెట్టి పూర్ణచంద్రరావు, భొట్ల హరిప్రసాద్, బుద్దే రాజు, వై ఎన్ వి శివరావు, చల్లా తిరుమలేశ్వర్రావు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.