పార్టీ బలోపితానికి ప్రతి ఒక్క కార్యకర్తలు వైసిపి అభిమానులు సిద్ధం కావాలి
1 min readఆలూరు_ఎమ్మెల్యే_బూసినే_విరుపాక్షి
పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు ,ఆస్పరి వైసీపీ మండల స్థాయి నాయకులతో ఎమ్మెల్యే_విరుపాక్షి_* సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ.. ఆలూరు నియోజకవర్గం లోని ప్రతి ఒక్క వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు ఇకనుండి ప్రభుత్వ విధ్వంస రాజకీయానికి ఎదురు నిలబడి ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మంచి చేశారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో విధ్వంసపాలన కి చమర గీతం పాడాలని రాబోయే రోజుల్లో పార్టీ బలోపితానికి మనమందరం కలిసికట్టుగా ఉండి పార్టీని బలంగా సంసిద్ధం చేసుకోవాలని ఆలూరు_నియోజకవర్గం_ ఎమ్మెల్యే _విరుపాక్షి_ నాయకులను ఆదేశించారు. అదేవిధంగా ప్రతి మండలంలోని గ్రామ మండల నియోజకవర్గ కమిటీలు వేయడం ద్వారా నాయకులలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలూరు ఆస్పరి మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.