PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రపంచానికి భారతదేశం అందించిన అపురూప సంపద యోగా

1 min read

యోగాతోనే ఆరోగ్య భారతం      విశ్రాంత కలెక్టర్

నంది వెలుగు ముక్తేశ్వర రావు IAS

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రపంచంలో అత్యంత విలువైనది ఆరోగ్యమని, అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగకు మించిన మార్గం మరొకటి లేదని, తిరుమల తిరుపతి దేవస్థానములు పూర్వ సంయుక్త కార్యనిర్వహణాధికారి, విశ్రాంత నల్లగొండ జిల్లా కలెక్టర్ నంది వెలుగు ముక్తేశ్వర రావు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండస్ పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు అనేక దృష్టాంతాలను వివరించి, గొప్ప లక్ష్యసాధకులు కావాలని ఉద్బోధించారు. విద్యార్థులు చేసిన అనేక యోగ భంగిమలు సంబ్రమాశ్చర్యాలను  కలిగించాయి. విద్యార్థులలో సృజనాత్మకతను పెంచుటకు పాఠశాల చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమానికి విద్యాసంస్థల అధినేత కె.వి.రాజశేఖర్ అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో గాయినీ రాజశేఖర్, సిఇఒ విల్సన్ అగస్టన్, ప్రధానోపాధ్యాయిని  మీనాక్షి విల్సన్, ప్రిన్సపల్ శ్రీనివాసులు రెడ్డి, కో-ఆర్డినేటర్స్ రమణ, వేణుగోపాల్ రెడ్డి, యోగా మాష్టరు బి.శ్రీనివాసులు, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author