PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మోకాళ్లనొప్పులకు యోగశక్తి చికిత్స

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: మోకాళ్లనొప్పులకు యోగశక్తిచికిత్స 10వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా జరుగుతున్న 21రోజుల  అవగాహన-చికిత్స-శిక్షణ కార్యక్రమాలను శనివారం అశోక్ నగర్ ఇండియన్ ఓం లో జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించినట్లు యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి మోకాళ్ళ నొప్పులకు ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ విధానంతో చికిత్స చేసి ఎవరికి  వారే చికిత్స చేసుకొనెందుకు పరికరాలను అందచేసారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు బాలసురేష్, ఆక్యుథెరపిస్ట్ లు వెలగపూడి శ్రీదేవి, అంబటి ప్రవల్లిక, అశ్రపున్నీష, యోగ శక్తి సాధన సమితి కార్యదర్శి కొండవీటి సుమతి పాల్గొని సేవలు అందించారు.

About Author