PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సమస్యల సాధనకు పోరు బాట పట్టాలి..

1 min read

ఏపీడబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పిలుపు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో పాత్రికేయులుతీవ్ర సంక్షోభంలో ఉన్నారనిసమస్యల సాధనకు పోరాట పంధాయే మార్గమని ఏపీడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులుఉద్బోధించారు.ప్రస్తుతం మీడియా యావత్తు ఇటు ప్రభుత్వం తోను అటు యాజమాన్యపరంగా ఇక్కట్ల నెదుర్కొంటున్నారని  ఆవేదన వ్యక్తం చేసారు.ఏలూరు జిల్లా తృతీయ కార్యవర్గ సమావేశం బుధవారం ఇక్కడి పి ఆర్ ట్రైనింగ్ సెంటర్లో జిల్లా అధ్యక్షుడు ఎస్ డి జబీర్అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథిగా విచ్చేసినరాష్ర్ట ప్రధాన కార్యదర్శిఆంజనేయులు విలేకరులసాధక బాధలు ప్రస్తావించారు. వారు నడిరోడ్డుపై ఉన్నారని నూతన కూటమి ప్రభుత్వంనాలుగు దశాబ్దాల పరిపాలనానుభవంకలిగిన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు సారధ్యం లోఏర్పడిందని అభినందించారు.గత తెలుగుదేశం ప్రభుత్వంఇటీవల వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంజర్నలిస్టుల ఇళ్ల స్థలాలు,మంజూరు విషయంలోన్యాయం చేస్తామని హామీ ఇచ్చి చివరిరోజు వరకు మభ్య పెట్టారని ఆవేదన చెందారు. చంద్రబాబు గత ప్రభుత్వం లో ప్రతి విలేఖరికి మూడు సెంట్లఇంటి స్టలం, నంద్యాల ఉప ఎన్నికల సమయం లోత్రిబుల్ బెడ్ రూమ్స్ ఇల్లుకట్టిస్తా మని హామీ ఇచ్చిపట్టించుకోలేదని గుర్తు చేశారు.చివర్లో జర్నలిస్టులఇళ్ల స్థలాల పధకాన్నిరూ100 కోట్లు మొదలు పెట్టిపూర్తి స్థాయిలో అమలు చేయడం జరగలేదని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం లో సెంటు సెంటున్నర  అనితరువాత 40 శాతం వాటా అని జీవో కూడా ఇచ్చి అమలు చేయకుండావదిలేసినట్టు తెలిపారు.రెండు ప్రభుత్వాలు ఎన్నికలముందు ఆశపెట్టి కోడ్ సాకుతోఫైల్  పక్కన పెట్టేసారని ఆరోపించారు.సానుకూల దృక్పథంతోముందుకు సాగుదాం..నూతన  కూటమి ప్రభుత్వంతో సానుకూలంగా ముందుకువెళదాం అని ఆంజనేయులుపేర్కొన్నారు. సమాచార శాఖమంత్రి పార్ధ సారథి ని రాష్ట్రబాధ్యులు గా కలిసి సమయంకోరామని చెప్పారు. హోమ్తదితర శాఖల వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశామన్నారు.కాగా సమావేశంలో మాట్లాడినరాష్ట్ర కార్యదర్శికె ఎస్ శంకరరావుజిల్లాలో ఆయా నియోజకవర్గనేతలు ఎమ్మెల్యేలను కలిసి పరిచయం చేసుకోవాలనితద్వారా సమస్యలు  తెలీజెయ్యాల్ని చూచించారు.సమావేశంలో నూతన ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు.గతం లోమాదిరిగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలనిమరో తీర్మానం చేశారు. కార్యదర్శి వై వి హరీష్ తీర్మానాలుప్రవేశ పెట్టారు. దెందుల్తూరు కార్యదర్శివెంకట్ స్వాగతం పలికారు.సమావేశంలో సీనియర్ జర్నలిస్టులు కె బాల సౌరి,ఏ.కొండబాబుఉపాధ్యక్షులు,కె సోమశేఖర్,కె.కిరణ్ కుమార్,కలపాల శ్రీనివాస్, ఋషీ రావుకోశాధికారి చిన్నారావు,పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్గుండా రామకృష్ణ, పి ఎన్వీ రామారావు,కె.లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author