PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ ఆశీర్వాదాలే..నా విజయానికి సోపానాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నేను ఎమ్మెల్యేగా గెలుపొందడానికి మీ ఆశీర్వాదాలు నాపై ఉంటే చాలు నా విజయానికి సోపానాలు అని నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 7:30 వరకు డాక్టర్ సుధీర్ ఇంటింటికి తిరుగుతూ నాకు ఓటు వేయాలని చేతులు జోడిస్తూ ఓటర్లను కోరారు.గడప గడపకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో జగనన్నకే మీ ఓటు వేయాలని మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా రెండోసారి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్నికల్లో నన్ను గెలిపించాలని ప్రజలతో ఆయన అన్నారు.ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి మళ్ళీ తెచ్చుకుంటే ఇదే పథకాలు మళ్లీ కొనసాగుతాయని మీ పవిత్రమైన అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి,గ్రామ వైసీపీ నాయకులు రామలింగారెడ్డి జెసిఎస్ మండల కన్వీనర్ రవికుమార్,పుల్లయ్య,ఎంపీటీసీ హరి సర్వోత్తమ రెడ్డి,అబ్దుల్ ఘని,వైసీపీ మండల కన్వీనర్  తువ్వా లోకేశ్వర రెడ్డి,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,తలముడిపి సర్పంచ్ వెంకటేశ్వర్లు,మల్లు శివ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author