మీ కాలనీ సమస్యను తొందర్లోనే పరిష్కరిస్తా.. ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏరుకుల కాలనీలో ఉన్నటువంటి సమస్యలు అన్నింటిని పరిష్కరిస్తానని ఎరుకల కాలనీకి సంబంధించిన మహిళలు ఎమ్మెల్యేని కలిసిన సందర్భంలో ఎమ్మెల్యేగారు అన్నారు. గురువారం ఎరుకల కాలని సంబంధించిన కొంతమంది మహిళలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నందు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి తమ కాలనీలో డ్రైనేజీ కాలువల సమస్యలు, ఇరుకుగా ఉన్న రోడ్లు సమస్యలు, కరెంట్ పోల్ సమస్యలు, త్రాగునీటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు.దానికి స్పందించిన ఎమ్మెల్యే మీ ఏరియాకు అండగా ఉంటానని, మీ ఏరియాలో అభివృద్ధి పనులు తప్పకుండా చేసి చూపిస్తామని,మీ ఏరియాలో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కలిసిన మహిళలు ఎమ్మెల్యే స్పందించిన తీరుకు ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో ఎరుకల కాలనీ వాసులు సుంకమ్మ , దుర్గమ్మ , లక్ష్మి , గంగమ్మ మరియు తదితరులు ఉన్నారు.