PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీ రుణం నేను తీర్చుకోలేనిది: ఆర్థర్

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల రుణం నేను తీర్చుకోలేనిదని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ మంగళవారం సాయంత్రం పత్రికా ప్రకటన ద్వారా అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఓటర్ మహాసయులకు మీ అందరి పాదాలకు నమస్కరిస్తూ మీ  మాజీ శాసనసభ్యుడు తో గూరు అర్థర్  ప్రేమతో అభిమానంతో మీకు తెలియ చేయటం ఏమనగా మీరు డబ్బులకు లొంగ కుండా నేను పైసా ఇవ్వలేక పోయినా నాకు 7,909 ఓట్లు 7801+ పోస్టల్ బ్యాలెట్ 93+ఎక్స్ ఆర్మీ 15 మొత్తం 7,909 ఓట్లు వేసి మీకు మేమున్నాం అనే దైర్యం భరోసా నాకు ఇచ్చినందుకు మీకు నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని ఆయన అన్నారు.ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు నా పట్ల చూపిన ప్రేమ ఆదరాభిమానాలు మరువలేనివని అన్నారు.

About Author