PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధ్యాన్ చంద్ సాధించిన విజయాలతో యువత స్ఫూర్తి పొందాలి

1 min read

ప్రతి ఒక్క విద్యార్థి చదువు తో పాటూ క్రీడల్లో రాణించాలి.. ఎం.పి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మేజర్ ధ్యాన్ చంద్ సాధించిన విజయాలతో యువత స్ఫూర్తి పొందుతూ క్రీడల్లో ఉన్నత స్థానంలో రాణించాలని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు.జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించిన ర్యాలీని పాణ్యం ఎం.ఎల్.ఏ గౌరు చరితా రెడ్డి తో కలిసి  ఆయన జెండా ఊపి ప్రారంభించారు..ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ హకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పుట్టిన రోజునే జాతీయ క్రీడ దినోత్సవంగా ప్రకటించి వారిని గౌరవించుకోవడం జరిగిందన్నారు. క్రీడాకారులలో క్రీడ స్ఫూర్తిని నింపడానికి గాను వారి పేరును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి నిత్య విద్యార్థిగా ఉంటూ క్రీడలతో పాటు చదువులో రాణించాలన్నారు. మేజర్ ధ్యాన్ చంద్ ఒలంపిక్స్ లో సాధించిన విజయాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క క్రీడాకారుడు పతకాలు సాధించాలన్నారు. అలాగే క్రీడల్లో ఇతర దేశాలతో పోటీపడి పతకాల సాధనలో భారతదేశం ముందు ఉండే విధంగా క్రీడాకారులు కృషి చేయాలన్నారు..అంతకు ముందు హకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ఆవుట్ డోర్ స్టేడియంలో ధ్యాన్ చంద్ విగ్రహానికి ఎం.పి నాగరాజు, ఎం.ఎల్.ఏ గౌరు చరితా రెడ్డి, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవ్య, డిఎస్డిఓ భూపతిరావు, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, సెట్కూరు సిఈఓ పివి.రమణ, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author