మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
1 min readతల్లితండ్రుల ఉన్నత ఆశయాలను కొనసాగించాలి.. ఎస్సై నాగార్జున రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడవేముల: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని. చదువుపై శ్రద్ధ పెట్టి చదవడం వల్ల సమాజంలో మంచి ఉద్యోగాలలో స్థిరపడవచ్చని సోమవారం నాడు గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల యువత గంజాయి. తదితరమత్తుపదార్థాలకు. బానిసలవుతున్నారన్నారనీ. మాదక ద్రవ్యాలతో అనారోగ్యం పాలై జీవితం అంధకారమవుతుందని అన్నారు. యువత చదువుతోపాటు క్రీడలపై మక్కువ పెంచుకోవాలని, క్రమ శిక్షణతో కూడిన చదువు వలన ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. అలాగే విద్యార్థినిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిసరాల్లో సంచరిస్తే ఉపాధ్యాయులకు లేదా తమకు తెలపాలని జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు విక్టర్ ఇమ్మానుయేల్. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు. పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.