PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నందిగామలో కదం తోక్కిన వైసిపి దండు..

1 min read

అట్టహాసంగా మొండితోక నామినేషన్…

నందిగామలో వైసిపి నేతలు,కార్యకర్తలతో నిండిపోయిన రోడ్లు..

ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీరిన వేలాది మంది మహిళలు..

మళ్ళీ జగనే రావాలంటూ నినాదాలు..

ప్రజా ప్రభుత్వం జగన్ తోనే సాధ్యం వైసిపి నేతలు.కేశినేని,మొండితోక సోదరులు

పల్లెవెలుగు వెబ్ నందిగామ:  రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విజయవాడ ఎంపి అభ్యర్ధి కేశినేని శ్రీనివాస్ (నాని),నందిగామ ఎంఎల్ఏ అభ్యర్ధి మొండితోక జగన్మోహన్ రావు,ఎంఎల్సీ డాక్టర్  అరణ్ కుమార్ లు పేర్కొన్నారు. నందిగామ వైసిపి ఎంఎల్ఏ భ్యర్ధిగా మొండితోక జగన్మోహనరావు నామినేషన్ సందర్భంగా  వేలాది మంది వైసిపి నేతలు,కార్యకర్తలు,అభిమానులు,శ్రేయోభిలాషుల తో కలిసి ర్యాలీగా వెళ్ళి,నిబంధల ప్రకారం అర్డీఓ రవీంద్రబాబుకు నామినేషన్ దాఖలు చేశారు. నందిగామ పట్టణంలో ఎక్కడ చూసిన జనమే జనం అదే వైసిపి విజయానికి చిహ్నంలా అనిపించింది.కిక్కిరిసిన జన సముద్రంతో ఫ్యాన్ గాలి టాప్ గేర్ లో తిరిగిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనంతరం నేతలు కేసినేని,మొండితోక  మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనతో రాష్టంలోని ప్రతిఒక్క కుటుంబానికి మేలు జరుగుతుందని వివరించారు.జగనన్న అధికారం చేపట్టాక రాష్ట్రం లో అనేక విపత్కర పరిస్ధితులు ఎదురైనా నేనున్నానంటు అండగా నిలిచి కరోనాను తరికొట్టారు,అంతే కాకుండా నాడు-నేడు తో విద్యావ్యవస్ధలో సములమైన మార్పులు తీసుకు వచ్చి పేదలకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీషు చదువులు పేదవిద్యార్ధుల ముంగిట నిబేట్టారని,రాష్ట్రం‌లో అర్హులైన వారందరికీ మెరుగైన కార్పోరేట్  వైద్యసేవలు అందించాలనే దృక్పధంతో 5లక్షలు ఉన్న అరోగ్యశ్రీ పధకాన్ని 25లక్షలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దేనని అన్నారు.గతంలో సంక్షేమ పధకాలు కావాలంటే జన్మభూమి కమిటీల సిఫార్సులు కావాలి ,వైసిపి ప్రభుత్వంలో కులం,మతం,వర్గం,పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఇంటి తలుపులు తడుతున్నాయంటే అది ఒక్క వైసిపి అందిస్తున్న పారదర్శన పాలనకు నిదర్శనమని కేశినేని నాని,మొండితోక అన్నారు.నందిగామ రూపురేఖలు మార్చే విధంగా అభివృద్ది చేశామని ,మరింత అభివృద్ది చేయాల్సి ఉందన్నారు..నామినేషన్ సందర్భంగా నియోజకవర్గం నుండి వచ్చిన నాయకులకు ,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు,రెట్టింపు ఉత్సహంతో గ్రామల్లో పని చేసి గతం కంటే ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు మంగునూరి కొండారెడ్డి,కొవెలమూడి వెంకటనారయణ,మహ్మద్ మస్తాన్,బషీర్,చల్లా బ్రహ్మం,షేక్ జాఫర్,పఠాన్ సైదాఖాన్,కొమ్ము విజయరాజు,శివనాగేశ్వరావు,దుబాయి కరీముల్లా,కట్టప్ప,అమిన్,మున్నాభాయ్, సుబ్బారావు,న్యాయవాది పఠాన్ కరీముల్లా తదితరులు,వేల సంఖ్యలో  నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.

About Author