దళితులు.. పేదల భూములు కబ్జా చేసిన వైసీపీ నేతలు
1 min readగ్రీవెన్స్ లో నేతల ముందు లబోదిబోమంటూ న్యాయం కోసం వేడుకున్న అర్జీదారులు
న్యాయం చేస్తామంటూ బాధితులకు నేతల హామీ
పల్లెవెలుగు వెబ్ అమరావతి: గత అరాచక పాలన వలన అంధకారంలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడమే లక్ష్యంగా… ప్రజాసేవే పరామావధిగా.. ప్రజల సమస్యలు తీర్చడమే ధ్యేయంగా.. ప్రజా బంధువు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే అడుగులు వేయగా.. అధినేత సంకల్పానికి తోడై మంత్రులు నేతలం ముందుకు సాగుతున్నామని. ప్రజా సమస్యలు తీర్చే దేవాలయంగా టీడీపీ కేంద్ర కార్యాలయం మారిందని. గత రాక్షస పాలనలో అన్యాయానికి గురై.. అనేక ఇబ్బందులు పడి.. నాడు దాచుకున్న కన్నీళ్ల సుడులతో గుండెల నిండా వ్యథతో తమ గోడు చెప్పుకుని న్యాయం పొందడానికి అర్జీదారులు నేడు గ్రీవెన్స్ కార్యక్రమానికి పోటెత్తారని.. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యలయంలో అర్జీలు స్వీకరించిన మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాక్ అహ్మద్ అన్నారు. అర్జీదారులు నుండి వినతులు స్వీకరించి.. సంబంధిత అర్జీలపై అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను వివరించి పరిష్కరించేందుకు కృషి చేశామన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో పలువురికి ఆర్థిక సాయం నిమిత్తం చెక్కులు అందించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 1986 లో ప్రభుత్వం ఇచ్చిన భూములు దాదాపు 430 ఎకరాలను ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని శ్రీ సత్యసాయి జిల్లా పెనుంగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పోలే పల్లి గ్రామానికి చెందిన బాధితులు అంజినప్ప, మారెప్ప, సాదరి గొవిందప్ప, యలవ నారాయణప్ప ఆదేమ్మ, బుడ్డయ్యలు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కబ్జాదారుల నుండి తమ భూములను విడిపించాలని నేతలను వేడుకున్నారు. తాను తన మద్దతు దారులు టీడీపీలో చేరడంతో టాంజానియాకు వెళ్లిన తనకొడుకుపై అక్కడకు పంపిన ఏజెంట్ వైసీపీ సానుకూలపరుడు కావడంతో అక్కడ అక్రమ కేసులు పెట్టించాడని.. తన కుమారుడిని తిరిగి ఇండియాకు రప్పించాలని సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం తంగేడు కుంట గ్రామాని చెందిన సోమశేకర్ రెడ్డి నేడు గ్రీవెన్స్ లో వేడుకున్నాడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం తాడేపల్లికి చెందిన జూటూరు మంగమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తాను పేదరాలునని తనకు యాక్సిడెంట్ లో కాలు చేయి విరిగాయని ఎటువంటి పనులు చేసుకోలేనని. తనకు పింఛన్ పెట్టించవలసిందిగా ఆమె నేడు గ్రీవెన్స్ లో అర్థించారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం సిద్దనకిచామపల్లెలో ఎంపీపీ స్కూల్ నందు పనిచేస్తోన్న హెడ్ మాస్టర్ వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేస్తూ.. బడిపిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని దాన్ని ఎంఈవో దృష్టికి తీసుకెళ్లామని.. అతనిపై చర్యలు తీసుకోవాలని నేడు ఆగ్రామానికి చెందిన నారాయణ, రోశయ్యలు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.