కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ వైయస్ఆర్ సిపి పార్టీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ముగతి గ్రామానికి చెందిన వైయస్ఆర్ సిపి గృహ సారథి సత్య రెడ్డి గ సతీమణి సొమేశ్వరమ్మ, కుమారుడు హరికృష్ణ ల పార్టీ కార్యాలయం నందు వైయస్ఆర్ సిపి ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి బుట్టా రేణుక కి శాలువా కప్పి పోష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వైయస్ఆర్ సిపి వార్డు కన్వినర్/గృహ సారదుల శ్రేయస్సు కొరకు 5 లక్షల రూపాయల భీమాని కన్వినర్/గృహ సారదుల పేరున భీమా చెయ్యడం జరిగిందిని. అందులో భాగంగానే ముగతి గ్రామ వైయస్ఆర్ సిపి గృహ సారథి సత్య రెడ్డి అనారోగ్యంతో 26.02.2024 తేదిన మృతి చెందిన సత్య రెడ్డి కుటుంబ సభ్యుల ఖాతాలో 5 లక్షల రూపాయలు భీమా నగదు జమ కావడం జరిగిందని అందుకే సత్య రెడ్డి కి కుటుంబసభ్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ధ్యవాదములు తెలిపారు అని ఆమె తెలియజేశారు.ఈ కార్య్రమంలో నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు వీరుపాక్షీ రెడ్డి, మాజి ఎల్ ఎల్ సి డైరెక్టర్ గడ్డం నారాయణ రెడ్డి,నందవరం మండల వైయస్ఆర్ సిపి పార్టీ ప్రధాన కార్యదర్శి పేట శ్రీనివాస్ రెడ్డి,పొనకలదిన్నె సర్పంచ్ నాగరాజు,రాఘవరెడ్డి,తారక్,ఉరుకుందప్ప,సోమనాథ్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.