మళ్లీ వచ్చేది వైయస్సార్ ప్రభుత్వమే .. కాటసాని శివ నరసింహారెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఈసారి ఎన్నికల్లో మళ్లీ వచ్చేది వైయస్సార్ ప్రభుత్వమే అని పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి తనయుడు కాటసాని శివ నరసహారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం బిలకల గూడూరు గ్రామంలో కాటసాని శివ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇంటి ముంగిటకే సంక్షేమాన్ని అందించే ప్రజా ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుందామని ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. తమ మండలంలో ప్రచారం నిర్వహించడానికి వచ్చిన యువ నాయకుడికి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకే ఓటువేయాలని గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. కుట్రల కూటమి ఎన్ని మోస పూరిత హామీలిచ్చినా వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో మేలు జరిగిఉంటే మరోసారి ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు శేఖర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి. ఎల్లారెడ్డి అనిల్ కుమార్ రెడ్డి దస్తగిరి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి. యశ్వంత్ రెడ్డి. రాజారెడ్డి. సయ్యద్. షారుక్ భాషా. ఐచ్చిరెడ్డి ప్రతాప్. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.