టిడిపి నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 15-01-2025 తేదీన ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇంచార్జ్ శ్రీ మతి బుట్టా రేణుక, బుట్టా శివ నీలకంఠ ల సమక్షంలో గోనెగండ్ల మండల కన్వీనర్ వేముగోడు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేముగోడు గ్రామం నుండి టిడిపి నాయకులు కురువ సుగూరు నాగప్ప కుటుంబము, దిద్ది కాటి శేఖర్,దస్తగిరి,రాజు మహేష్,మనోహర్, వేణు, భాస్కర్, వీరేష్,నాగార్జున, 50 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక , బుట్టా శివ నీలకంఠ . ఆరు నెలలు కాలానికే కూటమి ప్రభుత్వం పై ప్రజలలో భారీ వ్యతిరేకత ఉందని ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదని 2029 లో మన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షుడు గాజులదిన్నె మల్లికార్జున రెడ్డి,మహబూబ్ బేగ్,వేముగోడు గ్రామ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, తదితరులు,పాల్గొన్నారు.