వైసిపి జిల్లా అధ్యక్షులుగా రవీంద్రుడు… నియోజకవర్గ ఇన్చార్జిగా నరేంద్రుడు
1 min readనియామకం పట్ల- వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల నూతన ఉత్సాహం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులుగా పోచమ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,కమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా పోచమరెడ్డి నరేన్ రామాంజులరెడ్డిని వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నియమించడం పట్ల ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకాలను పురస్కరించుకొని ఆయన చెన్నూరు పాత రోడ్డు వద్ద బాణాసంచా పేల్చి వైఎస్ఆర్సిపి అభిమానులకు, కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియామకాలతో నూతన ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అయిందని ఇది పార్టీ శ్రేణులకు ఒకింత ఉత్సాహం కలిగించే అంశమని ఆయన తెలియజేశారు. కమలాపురం నియోజకవర్గంలో యువ నాయకులు నరేన్ రామాంజుల రెడ్డి నేతృత్వంలో పార్టీ బలోపేత దిశగా సాగుతుందని, వైయస్సార్ సిపి లో ఉన్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకు, ప్రతి అభిమానికి ఆయన భరోసానివ్వడమే కాకుండా, అందరికీ అండదండగా ఉంటూ పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. రాబోవు రోజుల్లో పార్టీ బలోపేతం కావడమే కాకుండా, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు మేలు జరిగే విధంగా యువ నాయకులు నరేన్ రెడ్డి తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఇదే ఉత్సాహంతో పార్టీ శ్రేణులు మరింత ముందుకు వెళ్లడం జరుగుతుందని పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.